NRI-NRT

డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

నాట్స్ 12వ వార్షిక సంబరాలను డల్లాస్‌ నాట్స్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్లానో గ్రాండ్ సెంటర్‌లో జరిగిన బాలల సంబరాల్లో 5 నుంచి 18 ఏళ్ల సంవత్సరాల వయసున్న విద్యార్థినీ, విద్యార్ధులు 200 మంది పాల్గొన్నారు. శాస్త్రీయ సంగీతం, నృత్యంతో పాటు సినీ, జానపద విభాగాల్లో ఆట, పాటలపై పోటీలు నిర్వహించారు. యునైటెడ్ స్టేట్స్ చెస్ ఫెడరేషన్ సహకారంతో నాట్స్ జాతీయ యూత్ చెస్ ఛాంపియన్ షిప్ కూడా నిర్వహించింది. డల్లాస్ విభాగం నుంచి రాజేంద్ర యనమదల, సౌత్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ భాను లంక, చక్ కుందేటి, మాధవీ ఇందుకూరి, శ్రీకృష్ణ సల్లాం, ఆశ్విన్ కోట, రాజేంద్ర కాట్రగడ్డ, తిలక్, సుచింద్రబాబు, నాగిరెడ్డి మండల, సంజన కలిదిండి, రియా ఇందుకూరి, నవ్య వేగ్నేశ, అంజనా భూపతిరాజు, నాట్స్ అధ్యక్షులు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి, నాట్స్ కార్యదర్శి రంజిత్ చాగంటి, సంయుక్త కార్యదర్శి జ్యోతి వనం, జాతీయ సమన్వయకర్త అశోక్ గుత్తా, నార్త్ ఈస్ట్ జోన్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ యార్లగడ్డ, నాట్స్ బోర్డు నుంచి ఆది గెల్లి, ప్రేమ్ కలిదిండి, కిశోర్ కంచెర్ల, కిశోర్ వీరగంధం, డల్లాస్ స్థానిక చాప్టర్ సభ్యులు కిరణ్ జాలాది, ప్రసాద్, మహిళా వేదిక నుంచి దీప్తి సూర్యదేవర, హెల్ప్ లైన్ టీం కవితా దొడ్డ తదితరులు ఈ సంబరాలకు సహకరించారు.