Health

కోవిద్ టీకా వేయించుకోకపోతే హర్యానాలో నిషేధం

కోవిద్ టీకా వేయించుకోకపోతే హర్యానాలో నిషేధం

హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్‌ వేయించుకోని వ్యక్తులు బహిరంగ ప్రదేశాలలో తిరగడాన్ని నిషేధించింది. భారతదేశంలో పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల మధ్య హర్యానా ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. రెండు డోసుల టీకాలు వేసుకున్న వ్యక్తులు మాత్రమే రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాలైన మాల్స్, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలను సందర్శించడానికి అనుమతి ఉంటుంది. ఈ కొత్త నిబంధన జనవరి 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది.