NRI-NRT

పేద విద్యార్థులకు తానా ఫౌండేషన్ “చేయూత”

పేద విద్యార్థులకు తానా ఫౌండేషన్ “చేయూత”

తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మాజీ తానా సహాయ కోశాధికారి కోగంటి వెంకట్ 10మంది పేద ప్రతిభా విద్యార్థులకు అందించిన ఉపకారవేతనాలను తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటరమణ అందజేశారు. బుధావారం నాడు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వీటిని లబ్ధిదారులకు అందజేసినట్లు తానా ఫౌండేషన్ కార్యదర్శి, చేయూత కార్యక్రమ సమన్వయకర్త వల్లేపల్లి శశికాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. BOD నిమ్మలపూడి జనార్ధన్, తానా క్రీడల సమన్వయకర్త శశాంక్ తదితరులు పాల్గొన్నారు.