WorldWonders

₹10వేల కోట్ల భూమి TS ప్రభుత్వానిదే-హైకోర్టు

₹10వేల కోట్ల భూమి TS ప్రభుత్వానిదే-హైకోర్టు

రూ.10వేలకోట్ల భూవివాదం పై హైకోర్టు కీలక తీర్పు

మంచిరేవులలో రూ.10వేల కోట్ల విలువైన వివాదాస్పద భూమిపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రేహౌండ్స్‌కు కేటాయించిన 142 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలిపింది.

గ్రేహౌండ్స్‌కు కేటాయించిన 142 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలిపింది. 2007లో ఈ భూమిని అప్పటి ప్రభుత్వం గ్రేహౌండ్స్‌కు కేటాయించింది. దాదాపు రూ.10వేల కోట్ల విలువ చేసే ఆ భూమి తమదేనని 45 మంది హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లకు పరిహారం చెల్లించి భూ సేకరణ చేయాలని 2010లో హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు చెప్పారు.

అయితే, సింగిల్‌ జడ్జి తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది. ప్రభుత్వ అప్పీలుపై విచారణ జరిపిన హైకోర్టు సీజే ధర్మాసనం .. ఆ భూమి ప్రభుత్వానిదేనని తీర్పు వెలువరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.