Food

రాళ్ల చపాతీలు చేసే మహిళల కోసం ప్రత్యేకం

రాళ్ల చపాతీలు చేసే మహిళల కోసం ప్రత్యేకం

చాలా ఇళ్లలో చపాతి గట్టిగా ఉండి త్వరగా పాడవుతాయి. మహిళలు ఎంత మెత్తగా చేద్దామని ప్రయత్నించినా అవి గట్టిగానే ఉంటాయి. చివరకు పిండిని కూడా మారుస్తారు కానీ ఎటువంటి ఫలితం ఉండదు. చపాతి మెత్తగా, ఉబ్బినట్లు మృదువుగా రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. దీని కోసం ముందుగా మంచి నాణ్యమైన పిండిని కలిగి ఉండటం అవసరం. తరువాత చపాతి చేసే ప్రక్రియ గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. మెత్తటి చపాతి రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పిండిని మెత్తగా ఉండాలి
మీరు పిండిని మెత్తగా చాలాసేపు పిసికాలి. పిండి గట్టిగా ఉంటే చపాతి గట్టిగా ఉంటుంది. పిండి మెత్తగా ఉంటే చపాతి కూడా మెత్తగా ఉంటుంది. కావాలంటే పిండిని పిసుకుతున్నప్పుడు అందులో కొద్దిగా పాలు జోడించాలి. అప్పుడు చపాతి మృదువుగా వస్తుంది.

2. కొద్దిసేపు సమయం కేటాయించాలి
పిండిని పిసికిన తర్వాత ఒక పావుగంట అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ రోటీలు మెత్తగా ఉంటాయి. కావాలంటే పిండిలో కొద్దిగా వంటనూనె కూడా కలుపుకొని పిండి పిసికితే మెత్తగా తయారవుతుంది.

3. తక్కువ పొడి పిండి
తరచుగా ప్రజలు చపాతి చేసేటప్పుడు పొడి పిండిని ఉపయోగిస్తారు. ఇలా చేయడం ద్వారా చపాతి సులభంగా వస్తుంది. కానీ దీని కారణంగా రొట్టె తేమ అంతరిస్తుంది. గట్టిగా తయారవుతుంది. కాబట్టి పొడి పిండిని తక్కువగా వాడాలి.

4. తక్కువ వేడి మీద కాల్చాలి
చపాతి కాల్చేటప్పుడు మంటను తక్కువగా పెట్టడం మంచిది. చాలా వేడిగా ఉంటే పిండి ఉడికిన తర్వాత గట్టిపడుతుంది. కొంచెం నెయ్యి రాసి కాల్చితే రుచితో పాటు మెత్తగా ఉంటాయి.