Editorials

అమరావతి మున్సిపల్ సిటీ కార్పొరేషన్ ACCMC నోటిఫికేషన్ జారీ

అమరావతి మున్సిపల్ సిటీ కార్పొరేషన్ ACCMC నోటిఫికేషన్ జారీ

ఏపీ రాజధాని అమరావతిని నగరపాలక సంస్థగా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ గా మార్చనుంది. ఇందులో భాగంగా రాజధానిలోని 19 గ్రామాలను ఈ కార్పొరేషన్ పరిధిలో చేర్చనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సేకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తుళ్ళూరు మండలంలోని 16 గ్రామాలను అమరావతి మున్సిపల్ సిటీ కార్పొరేషన్ ACCMCలో విలీనం చేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్‌ను ఆదేశించింది ప్రభుత్వం. దాని ప్రకారమే నోటిఫికేషన్‌ ఇచ్చారు గుంటూరు జిల్లా కలెక్టర్‌.