NRI-NRT

తెలుగు రాష్ట్రాలలో ముగిసిన ఆటా వేడుకలు

తెలుగు రాష్ట్రాలలో ముగిసిన ఆటా వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఆటా వేడుకలు

అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన వేడుకలు, సామాజిక సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిసినట్లు ఆటా అధ్యక్షుడు భువనేష్ భుజాల TNI కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. గత డిసెంబర్ మొదటి వారం నుండి 26 వ తేదీ వరకు నిర్వహించిన సేవా సాంస్కృతిక కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగాయని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతఙతలు తెలుపుతున్నట్లు భువనేష్ తెలిపారు.

గత 26 వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ఆటా ముగింపు వేడుకలు, అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈ ఉత్సవానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , సినీ నటులు సుమన్, భానుచందర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు ముఖ్య అతిధులుగా హాజరైనట్లు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో ప్రముఖ గాయిని శోభారాజ్ కు జీవన సాఫల్య పురస్కారం అందించినట్లు తెలిపారు.

సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్, కవి యాకూబ్, సాయి పద్మ , వేణుగోపాల్ రెడ్డి తదితరులకు ఆటా తరపున అవార్డులు అందజేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది జులై మొదటి వారంలో వాషింగ్ టన్ డీసీ లో నిర్వహిస్తున్న ఆటా మహా సభలకు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలిపారు.

తనతో పాటు ఆటా తదుపరి అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ఇతర కార్యవర్గ సభ్యులు శరత్ వేముల, అనీల్ బొద్దిరెడ్డి తదితరులు ఆటా వేడుకలు, సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి కృషి చేసినట్లు భువనేష్ భుజాల తెలిపారు.