NRI-NRT

అరుణ మిల్లర్‌కు మద్దతుగా తెలుగు ప్రవాసులు

అరుణ మిల్లర్‌కు మద్దతుగా తెలుగు ప్రవాసులు

అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విజయవాడకు చెందిన కాట్రగడ్డ అరుణ మిల్లర్ ప్రస్తుతం మరొక కీలక పదవికి పోటీలో ఉన్నారు. మేరీలాండ్ రాష్ట్రం నుండి డెమొక్రటిక్ పార్టీ తరపున కీలకమైన లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ఆమె పోటీలో నిలిచారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారు అరుణ మిల్లర్ కు మద్దతుగా నిలిచారు. ఆమెతో పాటు గవర్నర్ పదవికి పోటీలో ఉన్న Wes Mooreకు మద్దతు తెలిపారు. వీరిరువురికీ మద్దతుగా విరాళాలు సేకరించడం కోసం గురువారం సాయంత్రం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రవాస ప్రముఖులు నవీన్ ఎర్నేని, కాట్రగడ్డ కృష్ణ ప్రసాద్, మూల్పూరి వెంకటరావు, బత్తిన రాకేష్, గౌతం అమిర్నేని, రామ్ మట్టపల్లి, శశికాంత్ వల్లేపల్లి, ఉయ్యూరు శ్రీనివాస్, జై చల్ల తదితర తెలుగు ప్రముఖులు ఇప్పటికే భారీగా విరాళాలు ప్రకటించారు.