Politics

ఇకనుండి తేదేపా వాలంటీర్లు

ఇకనుండి తేదేపా వాలంటీర్లు

* రంగంలోకి తెదేపా వాలంటీర్లు..!!

* ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ పైన విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది.

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామ -వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. వారి ద్వారా ప్రజా సేవలు అందిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారంటూ పలుమార్లు టీడీపీ విమర్శించింది. ఎన్నికల సమయంలోనూ వాలంటీర్ వ్యవస్థను వాడుకోంటందంటూ ఆరోపణలు చేసింది. అయితే, పార్టీ నియోజకవ వర్గ ఇన్ ఛార్జ్ లు.. ఎంపీలు..ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.

* ప్రతీ వంద మంది ఓటర్ల బాధ్యత ఒకరికి.

రానున్న ఎన్నికలు ఆషామాషీ కాదని చెబుతూనే.. ఢీ అంటే ఢీ అనే విధంగా ఎదుర్కొనే వారనే అభ్యర్ధులుగా ఉండాలని స్పష్టం చేసారు. అలా ఉండలేని వారు పక్కకు వెళ్లిపోవాలని సూచించారు. ఇక, పార్టీ కార్యాచరణ వివరిస్తూనే…గ్రామ, వార్డు కమిటీల నియామకం ఈ నెల 15లోగా, మండల, క్లస్టర్‌, బూత్‌ కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. బూత్‌లలో ప్రతి వంద మంది ఓటర్ల బాధ్యత ఒకరికి అప్పగించాలని, పార్టీ అధికారంలోకి వచ్చాక వారినే వాలంటీర్లుగా నియమిస్తామని చెప్పారు.

* అధికారంలోకి వస్తే వారే వాలంటీర్లుగా.?

ఇలా ప్రతీ బూత్ పరిధిలోని వంద మందికి సంబంధించి పార్టీ పరంగా బాధ్యతలు కేటాయించిన వారే చూసుకుంటారు. వారితో టచ్ లో ఉండటంతో పాటుగా.. పార్టీకి అనుకూలంగా ఓటు వేయించటంలో వారు కీలక పాత్ర పోషించేలా పార్టీ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ప్రతీ ప్రభుత్వ పధకం అందించటంతో పాటుగా.. వారి సమస్యల పైనా స్పందిస్తున్నారు. దీంతో.. వాలంటీర్లకు తమకు కేటాయించిన వారి వరకు గుర్తింపు లభిస్తోంది. ఇప్పుడు టీడీపీ సైతం వాలంటీర్ల వ్యవస్థకు పోటీగా పార్టీ వాలంటీర్లను రంగంలోకి దించే ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

* రాజకీయంగా కీలకం కానున్న వాలంటీర్లు.

దీని ద్వారా వార్డు సచివాలయ వాలంటీర్లు ఒక వైపు.. టీడీపీ పార్టీ వాలంటీర్లు ఫీల్డ్ లో ఉంటారు. అయితే, ఇప్పుడు పార్టీకి వాలంటీర్లుగా పని చేసిన వారిని టీడీపీ అధికారంలోకి వస్తే వారినే వాలంటీర్లుగా నియమిస్తామంటూ చెప్పాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తయింది. వారు అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలో టీడీపీ నుంచి వస్తున్న ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. దీని పైన టీడీపీ ఏరకమైన క్లారిటీ ఇస్తుందో.. ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.