WorldWonders

ఈ కో‘ఢీ’ రూ.3.60 లక్షలు

ఈ కో‘ఢీ’ రూ.3.60 లక్షలు

సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మొదటిగా గుర్తొచ్చేది కోడి పందేలే. పందెంరాయుళ్ల అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కోళ్లను కొందరు పెంపకందార్లు దాదాపు ఏడాదిన్నరగా సిద్ధం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వి.కె.రాయపురంలో దగ్గుమిల్లి మధు పెంచుతున్న పందెం కోళ్ల ధరలను పరిశీలిస్తే వామ్మో.. అనాల్సిందే!.. 20 నెలలు వయసున్న రసంగి పందెం కోడి ధర రూ.3.60 లక్షలు పలుకుతోంది. పచ్చకాకి రకం కోడి విలువ రూ.2.60 లక్షలు ఉంది.