NRI-NRT

నాట్స్ బోర్డుకు నూతన కార్యవర్గం

నాట్స్ బోర్డుకు నూతన కార్యవర్గం

అమెరికాలో పెద్ద తెలుగు సంఘం నాట్స్‌ లో తొలిసారి ఓ మహిళను బోర్డ్ ఛైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు. తన మీద నమ్మకం ఉంచి నాట్స్ బోర్డ్ బాధ్యతలను అప్పగించిన నాట్స్ సభ్యులకు అరుణ గంటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళ సాధికారిత, మహిళా చైతన్యం కోసం నాట్స్ బోర్డ్ ఛైర్ పర్సన్‌గా తనవంతు కృషి చేస్తానని అన్నారు. నాట్స్ వైస్ చైర్మన్ గా ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డ్ కార్యదర్శిగా శ్యామ్ నాళం కు బాధ్యతలు అప్పగించారు.

**2022- 2023 సంవత్సరానికి నాట్స్ ప్రకటించిన బోర్డు సభ్యుల వివరాలు ఇవి..
చైర్ పర్సన్ గా అరుణ గంటి, ఇమ్మిడియేట్ పాస్ట్ చైర్మన్ గా శ్రీధర్ అప్పసాని, వైస్ చైర్మన్ గా ప్రశాంత్ పిన్నమనేని, బోర్డు కార్యదర్శిగా శ్యామ్ నాళం, సభ్యులుగా శేఖర్ అన్నే, డా.మధు కొర్రపాటి, శ్రీనివాస్ గుత్తికొండ, మోహన కృష్ణ మన్నవ, డా. సుధీర్ అట్లూరి , ఆది గెల్లి , శ్రీ హరి మందాడి, శ్రీనివాస్ మంచికలపూడి, రాజ్ అల్లాడ, ప్రేమ్ కలిదిండి, కృష్ణ మల్లిన, వంశీ కృష్ణ వెనిగళ్ల,
చంద్రశేఖర్ కొణిదెల, శ్రీనివాస్ మల్లాది, రాజేంద్ర మాదాల, మధు బోడపాటి, సునీల్ పాలేరు, శ్రీనివాస్ అరసాడ, రాజేష్ నెట్టెం, రఘు రొయ్యూరు, సుమిత్ అరిగపూడి, శ్రీనివాస్ బొప్పన, మూర్తి కొప్పాక ఎన్నికయ్యారు.