Health

TNI నేటి కరోనా బులెటిన్ – 08/01/2022

TNI  నేటి కరోనా బులెటిన్ –  08/01/2022

1. డ్రాగన్ ఫ్రూట్లో కరోనా ఆనవాళ్లు❓
కరోనా గురించి రోజుకో కొత్త విషయం ఆందోళన కలిగిస్తోంది . తాజాగా డ్రాగన్ ఫ్రూట్లో కరోనా ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడైంది . చైనాలోని 9 నగరాల్లో ఈ పండ్లపై జరిగిన పరీక్షల్లో వైరసన్ను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తైవాన్ , వియత్నాం నుంచి దిగుమతులను నిలిపేసి , ఆయా నగరాల్లోని సూపర్ మార్కెట్లను మూసేశారు. పండ్లను కొనుగోలు చేసినవారు క్వారంటైన్లోకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు.

2. భారత్ లో 3071 ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర ఢిల్లీలో సగంపైగా కేసులు
ప్రపంచాన్ని ఓమిక్రాన్ చుట్టుముడుతోంది. అత్యంత వేగంతో ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తోంది. కేసుల సంఖ్య రోజరోజుకు పెరుగుతోంది. ఇండియాలో కూడా ఓమిక్రాన్ తీవ్రత ఎక్కువగానే ఉంది.అత్యంత వేగంతో విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇండియాలో ఇప్పటి వరకు 3071 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని 27 రాష్ట్రాలు/యూటీల్లో ఓమిక్రాన్ కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు ఓమిక్రాన్ నుంచి 1203 మంది రికవరీ అయ్యారు. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడే సగం కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 876 ఓమిక్రాన్ కేసులు రాగా… ఢిల్లీలో 513 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 333 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజుకు లక్షను దాటింది. అయితే ఈ కేసులన్నింటిలో కూడా ఎక్కువగా ఓమిక్రాన్ కేసులే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఓమిక్రాన్ సోకిన వారు త్వరగా కోలుకుంటుండటం… ఎక్కువగా అత్యవసర చికిత్స అవసరం రాకపోతుండటం కాస్త ఉపశమనం కలిగించే విషయం.

3. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీశాకు కరోనా పాజిటివ్
*డీఎంహెచ్ వో కు మరోసారి కరోనా
*విశాఖలో 613 యాక్టివ్ కరోనా కేసులు
*జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్యులు
విశాఖలో కరోనా డేంజర్ బెల్ మోగుతోంది. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీశాకు కరోనా పాజిటివ్ సోకింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. తిరుపతిరావుకు మరోసారి కరోనా సోకడంతో ఆయన చికిత్స పొందుతన్నారు. ఆయన స్థానంలో డాక్టర్ విజయలక్ష్మికి బాధ్యతలప్పగించారు. రోజుల వ్యవధిలోనే ఇద్దరు అధికారులకు పాజిటివ్ సోకడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. శుక్రవారం ఒక్కరోజు వ్యవధిలోనే జిల్లాలో 183కేసులు నమోదు కావడంతో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖలోనే అత్యధికంగా యాక్టివ్ కేసులుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

4. ఏపీలో నైట్ కర్ఫ్యూ అంటూ వదంతులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులు.. తప్పుడు మెసేజ్ లు ఇచ్చే వారిపై అధికారుల ఆరా.. ఎలాంటి నైట్ కర్ఫ్యూ లేదంటున్న అధికారులు.

5. తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని మధురై అరుణాచలం, మరికొన్ని ప్రాంతాలు పూర్తిగా లాక్‌డౌన్‌ విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు. మధురై అరుణాచలం మరియు మరికొన్ని ప్రాంతాల దేవస్థానాలు మూడు రోజులపాటు లాక్ డౌన్ విధించారు.కావున భక్తులు డైరెక్ట్ గా శబరిమల దర్శనం చేసుకో వలసినదిగా కోరడమైనది. సోమవారం వరకు పూర్తిగా లాక్ డౌన్.