DailyDose

TNI – నేటి నేర వార్తలు 08/01/2022

TNI – నేటి నేర వార్తలు 08/01/2022

*బెజవాడలో దారుణం. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం ఆత్మహత్య. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణం. బెజవాడలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ, కొడుకు విషం తాగి ఆత్మహత్య. కృష్ణానదిలో దూకి తండ్రీ, కొడుకు గల్లంతు. మృతులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తింపు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

*వనమా రాఘవ ను కొత్తగూడెం జిల్లా జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్(PCM) ముందు హాజరుపరిచిన పాల్వంచ పోలీసులు 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీ కి విధించిన మెజిస్ట్రేట్.

*పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన జంగారెడ్డిగూడెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

*ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) ఉన్నతాధికారినంటూ పలు మోసాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

*ఏ.కొండూరు మండలం గోపాలపురం వద్ద బైకునులారీ ఢీ-కొనడంతో తేలూరి బాబు (45) అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి. మృతుడు తిరువూరు ఆర్టీసీ కండక్టర్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు. అంతకు ముందుగు గోపాలపురం వద్ద జరిగిన ప్రమాదంలో అన్న బాబురావు మృతి చెందాడు. ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

*ముదినేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెవురుపాలెం సెంటర్‌ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు నాగరాజు నాని కలిదిండి వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*నవాబుపేటలోని వికారాబాద్‌ పట్టణ పోలీస్‌ అధికారులు శుక్రవారం పట్టణ పరిధిలో ఓ గుట్కా స్థావరంపై దాడి నిర్వహించారు. షేక్‌ అమీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి నుంచి రూ.2,53,274 విలువ గల గుట్కాలు సిగరెట్లు హుక్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

*వరంగల్ నగరంలోని రోహిణి ఆస్పత్రి హాస్టల్లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. హాస్టల్లోనే విద్యార్థిని ఉరి వేసుకున్నట్లు సమాచారం. గమనించిన యాజమాన్యం విద్యార్థినిని రోహిణి ఆసుపత్రికి తరలించింది. సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు.

* పుదుకోట జిల్లా గోపాలపట్టినంకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో రెండు రోజుల క్రితం చోరీకి గురైన సవర్ల బంగారు నగల్ని పక్కనే ఉన్న పాడుబడిన బావి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

* గుంటూరు జిల్లాలోని గురజాల మండలం మాడుగులలో దారుణం జరిగింది. గత రాత్రి ఇంట్లో ఉన్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఓ వ్యక్తి… మహిళ ఇంటి వద్దకు వచ్చి మంచి నీళ్లు కావాలని అడిగాడు. మంచినీళ్లు ఇచ్చేందుకు వచ్చిన మహిళపై ఆ వ్యక్తి యాసిడ్ పోశాడు. కాగా ఈ ఘటనకు మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే బాధితురాలిని కుటుంబసభ్యులు గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

* పెళ్లికి తొందర ఎందుకని తల్లిఅనడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అంబర్‌పేటలోని న్యూపటేల్‌నగర్‌లో గురువారం జరిగింది.

* కోయంత్తూరులో కుమార్తెకు విషమిచ్చి హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
*బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం ఆత్మహత్య. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్మరణం. బెజవాడలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ, కొడుకు విషం తాగి ఆత్మహత్య. కృష్ణానదిలో దూకి తండ్రీ, కొడుకు గల్లంతు. మృతులు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తింపు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

*ఒంగోలులోని ధారావారితోట ప్రాంతంలో శుక్రవారం జరిగిన గ్యాస్‌ సిలిండర్‌ పేలుడులో ఓ వృద్ధురాలితోపాటు ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు.

*తితిదేకు చెందిన శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఇద్దరు అధ్యాపకులు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారనే ఫిర్యాదులందాయి. ఈ అభియోగాలపై కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ సురేందర్‌, వార్డెన్‌ రామనాథంను సస్పెండ్‌ చేస్తూ ఈవో జవహర్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

*రైతుల ఆత్మహత్యలకు అడ్డుపడటంలేదు. తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే ఏకంగా ముగ్గురు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడగా మరొకరు వేదనతో హఠాన్మరణానికి గురయ్యారు.

*చీటింగ్‌ కేసులో అరెస్టు చేసిన చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె జడ్పీటీసీ సభ్యురాలు గీత భర్త కొండ్రెడ్డిని పోలీసులు శుక్రవారం మళ్లీ అరెస్టు చేశారు.

*ఆయిల్‌ ట్యాంకర్లు లేకుండానే వాటికి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు (ఆర్సీలు) సృష్టించిన కుంభకోణంలో.. కృష్ణా జిల్లా నందిగామ ఆర్టీవో కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ ఎన్‌.విఠల్‌ ఏకంగా ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్టీవో), మోటారు వాహన ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ)గా అవతారం ఎత్తినట్లు అధికారులు గుర్తించారు.

*మారుమూల గ్రామానికి చెందిన గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మఠంభీమవరం పంచాయతీ వాలుగూడెం గ్రామానికి చెందిన వంతల సింహాద్రి రెండురోజుల కిందట కట్టెల కోసం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆకస్మాత్తుగా ఎలుగుబంటి దాడి చేసింది. తీవ్ర గాయాలైన ఆయన్ను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం తరలించారు.

*మండల పరిషత్‌ ఉపాధ్యక్ష పదవి ఇస్తామని మాట ఇచ్చి తప్పారంటూ ఇటీవల వైకాపా ఎంపీటీసీ సభ్యుడు ఆరోపణలు చేయగా.. శుక్రవారం ఆయన ఇద్దరు కుమారులపై దాడి జరగడం కలకలం రేపింది. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

*ముక్కుపచ్చలారని 16 నెలల పసికందుపై కన్నతండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడు. కనికరం లేకుండా గొంతు నులిమి చంపాడు. ఈ ఘాతుకానికి పసిగుడ్డు తల్లీ సహకరించడం అమ్మతనానికి మాయని మచ్ఛ చిన్నారి మృతదేహాన్ని సొంతూరికి తరలించేందుకు రైలెక్కగా ప్రయాణికుల అనుమానంతో ఈ దారుణం వెలుగుచూసింది.