Sports

క్రికెటర్ బయోపిక్ లో అనుష్కశర్మ 

క్రికెటర్ బయోపిక్ లో అనుష్కశర్మ 

నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకురాబోతున్నది అనుష్కశర్మ. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జులాన్ గోస్వామి పాత్రలో ఆమె నటించబోతున్నది. జులాన్ గోస్వామి జీవితం ఆధారంగా ‘చక్ ద ఎక్స్ ప్రెస్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నది. ప్రాసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణ సంస్థ క్లీన్ స్టేట్ ఫిల్మ్స్ ద్వారా అనుష్క శర్మ నిర్మిస్తున్నది. ఇటీవల అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. మగవాళ్ల క్రికెట్ జెర్సీలపై పేపర్స్ అతికించి అమ్మాయిలు తమ పేర్లు రాసుకుంటూ గ్రౌండ్లోకి దిగడం ఆసక్తిని పంచుతున్నది. జులాన్ జీవితంలోని ఎత్తుపల్లాలను, క్రికెటర్గా ఆమె సాధించిన విజయాలను ఆవిష్కరిస్తూ ఈ సినిమా తెరకెక్కనున్నది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నది. కూతురుకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది అనుష్క.