Movies

మంత్రులకు దిమ్మతిరిగే పంచులిస్తున్న వర్మ

మంత్రులకు దిమ్మతిరిగే పంచులిస్తున్న వర్మ

వర్మతో వాదించాలంటే.. అటు వైపు కూడా మళ్లీ వర్మే ఉండాలి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లు ఉంది కదా!. ‘పుష్ప’ సినిమాలో ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అనే పాటలో ఇలాంటి లైనే ఒకటుంటుంది. ఇప్పుడు ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయమై.. అంతా మౌనంగా ఉన్నా, వర్మ మాత్రం తన ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై బాణాలను విసురుతూనే ఉన్నారు. ఆయన సంధించే అస్త్రాలను తట్టుకోవడం ఏపీ మంత్రుల వల్ల కూడా కావడం లేదు. ఎందుకంటే లాజిక్కులతో వారిని వర్మ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అయితే వర్మ సంధించే అస్త్రాలను వ్యంగ్యంగా పొలిటికల్ పంచ్ పేరుతో వైఎస్ఆర్‌సీపి అభిమానులు నడుపుతున్న ఫేస్‌బుక్‌లో జనవరి 5వ తేదీన ఓ పిక్‌ని వదిలారు. ఈ పిక్‌కి సమాధానమిస్తూ.. పొలిటికల్ పంచ్‌కే పంచ్ ఇచ్చాడు వర్మ. టికెట్ రేట్లు పెంచేవాడికి, ప్రేక్షకుడికి ఇబ్బంది లేనప్పుడు ప్రభుత్వానికి ఏంటి నొప్పి? ఇది గతంలో వర్మ అన్నది. దీనికి ఉదాహరణగా.. పొలిటికల్ పంచ్‌లో..విటుడుకి.. వేశ్యకు ఇబ్బంది లేనప్పుడు పోలీసులకు ఏంటి నొప్పి?లంచం ఇచ్చేవాడికి, పుచ్చుకునే వాడికి ఇబ్బంది లేనప్పుడు ఏసీబీకి ఏంటి నొప్పి? బ్లూ ఫిల్మ్ తీసేవాడికి, చూసేవాడికి ఇబ్బంది లేనప్పుడు సెన్సార్ వాళ్లకి ఏంటి నొప్పి? అని రాసి ఉంది. దీనికి సమాధానమిస్తూ.. ‘‘ఒరేయ్ సుబ్బారావుల్లారా నేను అడిగిన క్వశ్చన్ లీగల్ జ్యూరిస్ట్రిక్షన్‌లో ఉంది. మీరిచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ క్రిమినల్ యాస్పెక్ట్స్ లో ఉన్నాయి’’ అంటూ పంచ్‌కే పంచ్ ఇచ్చారు వర్మ.