Health

చలికాలంలో షుగర్ అదుపు

చలికాలంలో షుగర్ అదుపు

కాలాలు మారే కొద్దీ మన రోగనిరోధక వ్యవస్థ పనితీరు కూడా మారుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో వాతావరణ ప్రభావం మన ఆరోగ్యంపై తీవ్రంగానే ఉంటుంది. రకరకాల సీజనల్ వ్యాధులు, అనారోగ్యాలు కలిసి ముప్పేట మనపై దాడి చేస్తాయి.
దీనికి ప్రధాన కారణం శీతాకాలంలో వీచే విపరీతమైన చలిగాలులే. అందుకే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మధుమేహ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. జాగ్రత్త .. ! బియ్యం, బంగాళాదుంపల్లో కార్పొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి మధుమేహ రోగులు సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండడం మంచిది. మరీ తినాలనిపిస్తే మితంగా తీసుకోవాలి.
• ఆహారంలో తప్పనిసరిగా రైస్ తీసుకోవలంటే ప్రాసెస్ చేయని బ్రౌన్ రైస్ మంచి ప్రత్యామ్నాయం. ఇందులో కార్బోహైడ్రేట్లు ఆధికంగా ఉన్నప్పటికీ ఫైబర్ లాంటి శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి.
• బెల్లంలోనూ చక్కెర స్థాయులను పెంచే గుణాలుంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ బాధితులు బెల్లంతో తయారుచేసిన పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఈ శీతాకాలంలో మొక్కజొన్నతో చేసిన బ్రెలు, రోటీలను చాలామంది ఇష్టంగా తింటుంటారు. అయితే డయాబెటిక్ రోగులు మాత్రం మొక్కజొన్న పదార్థాలను మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అసలు చలికాలంలో వీటిని తీసుకోకపోతే మరీ మంచిదంటున్నారు.
• సాధారణంగా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి వేడి వేడి టీ, కాఫీలు ఎక్కువగా తీసుకుంటారు. వీటి కారణంగా రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి పానీయాలకు దూరంగా ఉండాలి.
గొంతునొప్పి, సాధారణ జలుబు, ఇతర అనారోగ్యాల నుంచి రక్షణ పొందేందుకు తేనెను ఔషధంగా ఉపయోగిస్తారు. అంతేకాదు. శీతాకాలంలో వచ్చే . పలు సీజనల్ వ్యాధుల నుంచి తేనె ఉపశమనం కలిగిస్తుంది. అయితే మధుమేహ రోగులు మాత్రం తేనెకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇది న్యాచురల్ స్వీట్ నర్. అయినా ఇందులో కూడా చక్కెర అధికంగానే ఉంటుంది. మధుమేహ రోగులు మాత్రం తేనెకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది . ఇది న్యాచురల్ స్వీట్ అయినా ఇందులో కూడా చక్కెర అధికంగానే ఉంటుంది.