NRI-NRT

అమెరికా పౌరులు కానివారైనా ఓటు వేయవచ్చు

అమెరికా పౌరులు కానివారైనా ఓటు వేయవచ్చు

అమెరికాలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన న్యూయార్క్ లో ఆదివారం ఓ చరిత్రాత్మక చట్టం రూపొందింది. దీని ప్రకారం .. అమెరికా పౌరులు కాని వారు కూడా న్యూయార్క్ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయొచ్చు. నగర మేయర్, సిటీ కౌన్సిల్ను ఎన్నుకోవచ్చు. పౌరసత్వం లేకపోయినా చట్టబద్ధంగా నివసిస్తూ ఉంటే చాలు . దాదాపు 8 లక్షల మంది పౌరసత్వం లేని పౌరులకు ఈ చట్టంతో లబ్ధి చేకూరనుంది. నెల రోజుల క్రితం ఇందుకు సంబంధించిన బిల్లును న్యూయార్క్ సిటీ కౌన్సిల్ భారీ మెజారిటీతో ఆమోదించింది . అదిప్పుడు చట్టంగా మారింది. అయితే ఈ ఓటు హక్కు స్థానిక మున్సిపల్ ఎన్నికలకు మాత్రమే పరిమితం. అధ్యక్ష, రాష్ట్ర ఎన్నిక వర్తించదు. ఈ కొత్త చట్టంతో న్యూయార్క్ నగరంలో చట్టబద్ధంగా కనీసం 30 రోజులు నివసించే పౌరసత్వం లేని ఏ పౌరుడికైనా ఓటు హక్కు లభిస్తుంది.