Devotional

TNI ఆధ్యాత్మిక వార్తా తరంగిణి- 10/01/2022

TNI ఆధ్యాత్మిక వార్తా తరంగిణి- 10/01/2022

1.ఓం నమో వేంకటేశాయ
తిరుమల సమాచారం 10-01-22 సోమవారం
నిన్న 9-01-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 32,235
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 15,003
నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.19 కోట్లు …
సర్వేజనాః సుఖినోభవంతు

2.శ్రీరంగంలో వీణ ఏకాంత సేవ.
దాదాపు 1000 సంవత్సరాలుగా శ్రీరంగంలో అత్యంత ప్రత్యేకమైన ఆచారాలలో వీణ ఏకాంత సేవ ఒకటి, ఇక్కడ వీణ నిలబడి ఉన్న స్థితిలో ఆడుతుండగా, లార్డ్ నంపెరుమాళ్ (ఉత్సవ మూర్తి) 1000 స్తంభాల మండపం నుండి మూలస్థానానికి తిరిగి వస్తాడు, అక్కడ ప్రతిరోజూ మధ్యాహ్నం, వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజులు జరుగుతుంది.భగవంతుడు రాత్రి తిరిగి వచ్చినప్పుడు, ప్రతిరోజూ ఈ ప్రత్యేక ఏకాంత సేవ జరుగుతుంది, వీణులు ఆడుతున్నప్పుడు ఆయనను ద్వజస్థంబం నుండి గర్భగుడి లోపలికి తీసుకువస్తారు. ఈ సేవ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది లేదా తరువాత ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆధారపడి ఉంటుంది. శీతాకాలం కావడంతో భగవంతుడుకీ సన్నని / చూసే శాలువతో అలంకరించబడి, భక్తులకు తన అందమైన స్వరూపాన్ని కనిపించేలా చేస్తాడు మరియు అతని హారము అతనికి తేలికగా అనిపించేలా వదులుగా ఉంటుంది.వీణుడిని భగవంతునితో ఆడినప్పుడు, ఆ ప్రదేశంలో వేరే శబ్దం ఉండకూడదని బృహదరణ్యక ఉపనిషత్తు ప్రస్తావించింది మరియు మౌనంగా ఉండమనీ, వీణలు వాయించడం ప్రారంభించక ముందే ఒక ప్రకటన చేయటానికి కారణం!
కాబట్టి వీణా ఏకాంత సేవా పఠనం సందర్భంగా పిన్ డ్రాప్ నిశ్శబ్దం ఉంటుంది, ఇక్కడ దివ్య ప్రభంధం, తిరుప్పావై, త్యాగరాజ కీర్తనలు, పురందర దాస కీర్తనలు, అన్నామాచార్య కీర్తనలు, రాజు విజయరంగ సొక్కనాథర్ కంపోజ్ చేసిన కీర్తనలు మొదలైనవి, భగవంతుడిని నిద్రపోయేలా నీలంబరి వంటి అత్యంత ఓదార్పు రాగాలలో … ఈ విధంగా భగవంతుడు తమిళం, సంస్కృతం, తెలుగు మరియు కన్నడ భాషలలో పాటలను ఆనందిస్తాడు!వీణలో ఆడినవన్నీ పరబ్రహ్మానికి చేరుకుంటాయని, పరమాత్మ ప్రశంసలు అందుకుంటాయని చందోగ్య ఉపనిషత్తు చెబుతోంది. వీణా సంగీతం కూడా మహాలక్ష్మి దేవి యొక్క రూపమని ఉపనిషత్తు పేర్కొంది.ఈ సంఘటన ఖచ్చితంగా భక్తులకు, సంగీత ప్రియులకు ఆనంద భాష్పాలు తెస్తుంది …!శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు, అర్థరాత్రి ఏకాంత సేవకు హాజరుకావడం మర్చిపోవద్దు … కొద్దిమంది భక్తులు మాత్రమే.

3. స్వామి..శుభాశీసులీయవా!
‘‘కోటి ఆశలతో కొంగొత్త జీవితంలో అడుగుపెట్టే వధూవరులకు సత్యదేవుని ఆశీస్సులు అందితే అంతకన్నా ఆనందం ఏముంది? మరపురాని… మధురమైన… ఆ అపురూప సమయాన స్వామివారి అక్షింతలు వధూవరులపై జాలువారితే ఆ కల్యాణం మరింత కమనీయం అవుతుంది.. కొత్త జంటలకు అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి అక్షింతలు, కుంకుమతో శుభాశీస్సులు అందించేవారు. కానీ… ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం లేదు. పలు కారణాలు చూపి పట్టించుకోవడం మానేశారు.’
*** భక్తులు ఎంతో మంది వారి పెండ్లి పత్రికను ముందుగా సత్యదేవుని వద్ద ఉంచి పూజలు చేస్తారు. కొంత మంది పోస్ట్‌ ద్వారా పంపిస్తారు. మరికొంత మంది హుండీల్లో వేస్తారు. ఇలా వచ్చిన కార్డులన్నింటీనీ సేకరించి సత్యదేవుని శుభాశీస్సులతో ప్రత్యేక కార్డు, పూజ చేసిన కుంకుమ, అక్షింతలు వారి చిరునామాకు పోస్టల్‌ ద్వారా పంపించేవారు. 2016లో దీనికి శ్రీకారం చుట్టారు. ఇలా కొంతకాలం కొనసాగించి సుమారు 10 వేల మందికి పైగా శుభాశీస్సుల కార్డుతోపాటు స్వామి వారికి పూజ చేసిన కుంకుమ, అక్షింతలు పంపారు.
**కారణం ఏంటంటే?
‘వధూవరులారా… మీ ఇరువురు అనురాగంతో మూడుముళ్ల బంధంతో నాలుగు పాదాల ధర్మనీతి కలిగి పంచభూతాల సాక్షిగా ఏడడుగులు నడకతో నిండు నూరేళ్లు జీవితాన్ని పిల్లాపాపలతో సుఖసంతోషాలతో, భోగభాగ్యములు, ఆయురారోగ్యములతో ఆనందంగా జీవించాలని దీవిస్తూ శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాము’ అని శుభాశీస్సుల లేఖలో ముద్రించి వధూవరుల పేర్లు, వివాహ తేదీ వేసి వారి శుభలేఖలో ఉన్న చిరునామాకు పంపేవారు. ఇలా వధూవరుల పేర్లతో దేవస్థానం అధికారికంగా శుభాశీస్సుల కార్డులు పంపడం వల్ల కొన్ని చిక్కులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
**తితిదేలో ఇలా…
ఎన్నో ఏళ్లుగా తితిదేలో శ్రీవారి ఆశీస్సులు కార్యక్రమం కొనసాగిస్తున్నారు. పెండ్లి పత్రికను దేవస్థానానికి పంపితే పెళ్లి సమయానికి స్వామి అక్షింతలు, కుంకుమ, కంకణం, కల్యాణ సంస్కృతి ఆశీర్వచన పత్రిక పంపుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా… ఆశీర్వచనం పత్రికను ముద్రించారు. తితిదేలో మాదిరిగా కొన్ని మార్పులు చేసి అన్నవరంలోనూ కొనసాగించాలని భక్తులు కోరుతున్నారు.

4. వేదాంగాలు అంటే…
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం… ఈ చతుర్వేదాలను అర్థం చేసుకోవడానికీ, వాటి ఉచ్చారణకు, వాటి ఉపయోగం ఏమిటో అవగాహన చేసుకోవడానికి అనుషంగికమైన ఆరు గ్రంథాలను పూర్వ మహర్షులు రూపొందించారు. అవే వేదాంగాలు.కల్పం, శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం.. అనే ఈ ఆరు వేదాంగాలు గద్యరూపంలో ఉంటాయి. యజ్ఞ క్రతు నిర్వహణ తదితరాల గురించి వివరించేది – కల్పం. వేదమంత్రాలు, ఋక్కుల ఉచ్చారణను వివరించేది- శిక్ష. వ్యాకరణ సూత్రాలను చెప్పేది- వ్యాకరణం. వేదాల్లోని శబ్దాలు, పదాల వ్యుత్పత్తినీ, అర్థాలను, వాటి స్వరూపాలను వెల్లడించేది- నిరుక్తం. వేదాల్లోని వివిధ ఛందస్సుల తీరుతెన్నులను తెలియజేసేది- ఛందస్సు. ఖగోళ శాస్త్రం గురించీ, ముహూర్త నిర్ణయం గురించీ వివరించేది- జ్యోతిషం.

5. ఎలా జీవించాలి ❓
మనిషి ఎలా బతకాలో చెప్పింది వేదం. చక్కగా చూస్తూ, చక్కగా వింటూ, మంచిగా మాట్లాడుతూ ఎవరికీ అధీనుడు కాకుండా ఉంటే మనిషి నూరేళ్లు బతుకుతాడని వేదం చెబుతోంది. ఎవరి ధనాన్నీ దొంగిలించకూడదు. అంటే, ధనార్జన ధర్మంగా ఉండాలి. అంతేకాదు- ద్వేషం లేని ప్రేమైక సమాజం మంచిదని వేదం బోధించింది.ఉపనిషత్తులో ఓ మాట ఉంది. నిత్యం ఏదో ఓ మంచి విషయాన్ని వింటూ ఉండాలి. చదువుతూ ఉండాలి. చదివినదాన్ని మననం చేసుకుంటూ ఉండాలి.ఎన్ని కష్టాలొచ్చినా సత్యాన్ని వదులుకోకూడదు. నైతికంగా పతనం కాకూడదు. నేను, నాది అన్న సంకుచిత భావనను వదిలిపెట్టాలి. చేసేవాడు, చేయించేవాడు ఆ భగవంతుడే అనుకుంటే- ఫలితాలమీద ఆపేక్ష ఉండదు.
‘మా, మేము, నా’ అనే స్వార్థానికి కౌరవులు జీవితంలో మొదటిస్థానం ఇచ్చారు. రెండో స్థానం ప్రపంచానికి, మూడో స్థానం భగవంతుడికిచ్చారు. ఫలితం అందరికీ తెలిసిందే. పాండవులు తమ జీవితంలో మొదటి స్థానాన్ని భగవంతుడికి ఇచ్చారు. ద్వితీయ స్థానాన్ని నిస్వార్థ బుద్ధితో ప్రపంచానికిచ్చారు. తరవాత తమ గురించి ఆలోచించారు. అందుకే భారత యుద్ధంలో విజేతలయ్యారు.
ఎవరైనా జీవితంలో ప్రథమస్థానం భగవంతుడికి ఇవ్వాలి. స్వార్థాన్ని మరచి పరోపకారానికి పాటుపడి త్యాగాలు చేయాలి. ఆ పైనే తమ గురించి ఆలోచించాలి. అప్పుడే జీవితం సంతోషభరితం అవుతుంది. ప్రతి మనిషీ ప్రపంచంలో ఒకడిగా తనదైన ముద్రవేయాలి తప్ప మందలో ఒకరిగా కలిసిపోకూడదు. విలువలతో కూడిన జీవితం గడపడం, సక్రమమైన మార్గంలో ప్రయాణించడంవల్లే మనిషి లక్ష్యాలను చేరుకోగలుగుతాడు. ఈ దేశంలో పుట్టిన సద్గురువులు ఎందరెందరో మానవసేవను మాధవసేవగా భావించారు. పరోపకారమే లక్ష్యంగా బతికారు. వినమ్రతతో దానధర్మాలు చేశారు.
మనుషులు రుషుల్లా మారారు. సంఘసేవకు నడుం బిగించారు. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ మహాత్ముడయ్యాడు. కాలడి నుంచి హిమాచలం వరకూ కాలినడకన వెళ్ళి నిష్ఠగా ధర్మాన్ని ప్రబోధించిన శంకరాచార్యులు జగద్గురువయ్యారు. వారందరూ సంఘ శ్రేయం కోసం తమ జీవితాలు ధారపోసి చిరస్మరణీయులయ్యారు.
ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు. సింహం నోరు తెరుచుకుని ఉన్నంత మాత్రాన వన్యమృగం దాని నోటికి అందదు కదా! అసలు మన ఆలోచనలనుబట్టే ప్రపంచం ఉంటుంది. మన దృష్టి మంచిదైనప్పుడు లోకం మంచిగానే కనిపిస్తుంది. చెడుగా చూస్తే ప్రపంచం చెడ్డగానే కనిపిస్తుంది. ఇతరులకు మేలు చేయకపోయినా కీడు తలపెట్టకుండా ఉండటం మంచిది. ప్రియంగా మాట్లాడితే శత్రువులైనా క్రమంగా మిత్రులవుతారు. సమాజశ్రేయానికి ప్రతి మనిషీ కృషిచేయాలి. నైతిక విలువలు పాటించి న్యాయమార్గంలో నడవాలి. ప్రేమను, జ్ఞానసంపదను అందరికీ పంచాలి. అప్పుడు మనిషి మనీషి అవుతాడు. అతడిలో భగవంతుడు కొలువై ఉంటాడు! అటువంటి ధన్యజీవులే ధరిత్రిని సంతోష ధామంగా, పుణ్యమూర్తులు నడయాడే ఆనందనందనంగా తీర్చిదిద్దడంలో కీలక భూమిక పోషించగలుగుతారు. – విశ్వనాథ రమ.