Health

TNI – కరోనా బులెటిన్ – 10/01/2022

TNI కరోనా బులెటిన్ – 10/01/2022

1. భారత్ లో కరోనా విలయ తాండవం ఒక్క రోజే 1,79,723 కరోనా కొత్త కేసులు
ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 1,79,723 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,57,07,727 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 7,23,619 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 549 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,83,936 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 46,569 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,45,00,172 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,51,94,05,951 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 29,60,975 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

2.సంపూర్ణ లాక్‌డౌన్?
* అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ కీలక భేటీ
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తీవ్ర రూపాన్ని దాల్చింది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గురువారం నాటి బులెటిన్ ప్రకారం..ఒక్కరోజులోనే 90,928 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణకూ అంతు లేకుండా పోయింది. 2,630 ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరువైంది. 2,85,401 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో రోజువారీ పాజిటివ్ కేసులు లక్షకు చేరువైన వేళ..
*రంగంలోని ప్రధాని మోది
మోడీ రంగంలోకి దిగారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. వర్చువల్ రూపంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. దేశ రాజధానిలోని తన కార్యాలయం నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న కోవిడ్ స్థితిగతులను అడిగి తెలుసుకోనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేయనున్నారు.
*ముఖ్యమంత్రుల నుంచి సలహాలు..
కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్రం అమలు చేస్తోన్న ప్రొటోకాల్స్.. ఇతర మార్గదర్శకాల గురించి మరోసారి ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీన్ని పునఃసమీక్షించడంతో పాటు కొత్త ప్రొటోకాల్స్‌ను ఎప్పటికప్పుడు జారీ చేయడానికి అవసరమైన సూచనలు, సలహాలను ముఖ్యమంత్రుల నుంచి స్వీకరించే అవకాశం ఉంది. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్.. ఇక సర్వసాధారణం కానున్నట్లు తెలుస్తోంది.
*కొత్త కోవిడ్ ప్రొటోకాల్స్..
ముఖ్యమంత్రులు.. తమ తమ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించేలా నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛను ప్రధాని కల్పిస్తారని తెలుస్తోంది. దీనితోపాటు- వారంలో మూడు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించడం, తెల్లవారు జామున 6 నుంచి ఉదయం 10 గంటల వరకు దుకాణాలను తెరచుకోవడానికి అనుమతి ఇచ్చి.. అనంతరం మూసివేసేలా మార్గదర్శకాలను జారీ చేయొచ్చని తెలుస్తోంది. ఈ భేటీ ముగిసిన తరువాత కేంద్ర ప్రభుత్వం సరికొత్త కోవిడ్ ప్రొటోకాల్స్‌ను జారీ చేస్తుందని సమాచారం.

3. సంక్రాంతి తరువాత తెలంగాణాలో ఆంక్షలకు శ్రీకారం..!
పెరుగుతున్న కరోనా కేసుల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది.అధికారుల నుంచి సీఎం కేసీఆర్ నివేదిక కోరారు. ప్రస్తుతం రోజుకు 2500 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత, నియంత్రణపై కేసీఆర్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో రానున్న మూడు వారాలు అత్యంత కీలకమని ప్రభుత్వం భావిస్తోంది.కేసుల తీవ్రత, మరణాల సంఖ్య పెరిగితే ఆంక్షలు తప్పవు. అధికారులు చెబుతున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించవచ్చు. బార్లు, పబ్బులు, పాఠశాలలు, కళాశాలలు, మాల్స్, థియేటర్లపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం ఉంది..

4. ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించిన సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవం జరిగింది. రూ. 426 కోట్ల వ్యయంతో ప్రభుత్వాసుపత్రుల్లో ..
ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందుకుగానూ, రూ. 20 కోట్ల వ్యయంతో … ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ కంటైనర్లను కొనుగోలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్‌ పైప్‌లైన్లు సౌకర్యం కల్పిస్తారు. మొత్తం 39 లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటు చేశారు. కోవిడ్‌తో పాటు ఇతర చికిత్సలకు 20 అత్యాధునిక ఆర్టీపీసీఆర్‌ వైరల్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి.

5. కోవిడ్‌ పరిస్థితులపై సీఎం సమీక్ష
రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. కోవిడ్‌ విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించిన సీఎం. దేశవ్యాప్తంగా వైరస్‌ విస్తరిస్తున్న విషయాన్ని వివరించిన అధికారులు. కోవిడ్‌ సోకిన వారికి దాదాపుగా స్వల్పలక్షణాలు ఉంటున్నాయన్న అధికారులు. కోవిడ్‌లో ఒమిక్రాన్‌ లాంటి కొత్త వేరియంట్‌ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ఆమేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలని ఆదేశించారు. వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధంచేయాలన్న అంతేకాక చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేసి అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు.

6. Lockdownతో సరిహద్దులు మూసివేత
సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రం నలువైపులా వున్న అన్ని రాష్ట్రాల సరిహద్దుల్ని మూసివేశారు. అటు ఏపీ, ఇటు కర్ణాటక, మరోవైపు కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల సరిహద్దుల్ని మూసివేశారు. దీంతో ఈ ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే అత్యవసర సేవల కోసం వచ్చేవాటిని మాత్రం అధికారులు అనుమతిం చారు. కన్నియాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌ నుంచి, అదే విధంగా తేని జిల్లా నుంచి కుమిలిమీదుగా కేరళ వెళ్లే సరిహద్దులు, తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం నుంచి ఆంధ్రప్రదేశ్‌ వెళ్లే సరిహద్దు, కృష్ణగిరి జిల్లా హోసూరు నుంచి వెళ్లే కర్ణాటక సరిహద్దును మూసివేసిన పోలీసులు ఆయా ప్రాంతా ల్లో భారీగా మోహరించారు. తేని జిల్లాలో కుమిలి, కంబం ప్రాంతాల్లో వున్న చెక్‌పోస్టుల్లో నిఘా తీవ్రం చేశారు. కంబం, గూడలూరు తదితర ప్రాంతాల్లో వున్న దుకాణాలన్నీ మూతబడ్డాయి.