DailyDose

TNI క్రైం కార్నర్ – 10/01/2022

TNI క్రైం కార్నర్ – 10/01/2022

* కార్డెన్ సెర్చ్ లో సడెన్ గా ఎదురుకాల్పులు..వాళ్లిద్దరూ హతం. జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని హసన్‌పోరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు అక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ సమయంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

* బాలికను హోటల్కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఆమె ఇద్దరు స్నేహితులు. మాట్లాడాలని చెప్పి నమ్మించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్ ఆగ్రాలో జరిగింది. ఫిరోజాబాద్లో ఓ బాలికను కారు డ్రైవర్ రేప్ చేశాడు. మరోవైపు.. ఓ మహిళను నమ్మి తన ఇంటికి వెళ్లిన ఓ 16 ఏళ్ల బాలికపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేసి ఫోన్లో రికార్డు చేసి వేధింపులకు పాల్పడ్డారు. ఈ సంఘటన హరియాణా జింద్ జిల్లాలో జరిగింది.

*నల్గొండ పట్టణంలోని జరిగిన హత్య కలకలం రేపుతోంది. మహంకాళి ఆలయం దగ్గర తలభాగం పోలీసులకు లభ్యమైంది. అయితే ఈ మిస్టరీని ఛేదించేందుకు 6 బృందాలను ఎస్పీ రెమా రాజేశ్వరి ఏర్పాటు చేశారు. మృతుడి ఆచూకీ, శరీర భాగాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని కాటన్ మిల్లులు, కోళ్ల ఫారాలను పోలీసు బృందాలు తనిఖీ చేస్తున్నాయి.

*పోలూరు సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న భర్త ఏడాదికే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో బాధిత యువతి చంటి బిడ్డతో అత్తగారింటి ముందు ధర్నాకు దిగింది.

*విల్లియనూరులో ప్రజలకు ఇబ్బందికరంగా పెండ్లి రోజు పార్టీని జరుపుకుంటున్న వారిని ప్రశ్నించడంతో.. మద్యం మత్తులో ఉన్నవారు నవ వరుడిని కత్తితో పొడిచి హత్య చేశారు.

*భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భార్యపై కేసు నమోదు చేసినట్లు సీఐ తిరుపతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం కట్టుగుట్టతండాకు చెందిన భూక్యా శంకర్‌(30) తన భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈనెల 2న మద్యం సేవించిన శంకర్‌ ఇంట్లో మత్తుగా పడుకున్నాడు. భర్తను హతమార్చాలని పక్కా ప్లాన్‌ వేసుకున్న అతడి భార్య అర లీటరు పెట్రోల్‌ కొనుక్కొని వచ్చింది.

* భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో జయచిత్ర నాగరాజు అదృశ్యమయ్యాడు. భార్యే వివాహేతర సంబంధం నేపథ్యంలో అతడిని హత్య చేయించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొన్నూరులో ఆదివారం ఈ ఘటన జరిగింది.

* కోయంత్తూరులో కుమార్తెకు విషమిచ్చి హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కోయంబత్తూరు సమీపం పార్క్‌సిటీలో ధనలక్ష్మి (53) అనే వితంతువు నివసిస్తోంది. ఆమెకు శశి కుమార్‌ అనే కుమారుడుసుకన్య(32) అనే కుమార్తె ఉన్నారు.

* చాలాకాలం తరువాత రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. చెంగల్పట్టు జిల్లా ఉత్తిరమేరూర్‌ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీలు హతమయ్యారు. వారిద్దరూ రెండు హత్య కేసుల్లో ప్రధాన నిందితులు కావడం గమనార్హం.

* పెళ్లికి తొందర ఎందుకని తల్లిఅనడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అంబర్‌పేటలోని న్యూపటేల్‌నగర్‌లో జరిగింది.