DailyDose

TNI తాజా వార్తలు – వర్మ సంతృప్తి చెందాడు. – 10/01/2022

TNI తాజా వార్తలు – వర్మ సంతృప్తి చెందాడు. – 10/01/2022

* ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏపీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిసేందుకు ఈ రోజు అమరావతికి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రితో వర్మ భేటీ ముగిసింది. అనంతరం వర్మ మీడియాతో ముచ్చటించాడు. ఈ మేరకు వర్మ మాట్లాడుతూ.. ‘మంత్రి పేర్ని నానితో సమావేశం సంతృప్తి నిచ్చింది. ఆయనతో మాట్లాడాక నేను కూడా 100 శాతం సంతృప్తి చెందాను. టికెట్ల విషయంలో నా ఆలోచనలను మంత్రికి వివరించా. ప్రభుత్వ ఆలోచనలను మంత్రి కూడా నాకు వివరించారు. నేను కేవలం నా ఆలోచనలను మాత్రమే చెప్పడానికి వచ్చాను. వీటిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.

* బోరుపాలెం లో అమరావతి సిటీ క్యాపిటల్ కార్పొరేషన్ పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన అధికారులు.గ్రామ పంచాయతీ లో ఉండటం కంటే కార్పొరేషన్ లోకి మారితే ఎక్కువ అభివృద్ధి చెందుతుంది అని గ్రామస్తులకు చెప్పిన అధికారులు.అధికారులను నిలదిసిన గ్రామస్థులు.29 గ్రామాలను విభజించి పాలించాలి అనే కుట్రకు ప్రభుత్వం తెరలేపింది అని రైతులు మండిపాటు. 29 గ్రామాలు కలిపి కార్పొరేషన్ చేస్తే అంగీకరిస్తాం…కానీ 19 గ్రామాలు మాత్రమే కార్పొరేషన్ లోకి తీసుకువస్తాం అంటే సహించం అని అధికారులకు తేల్చి చెప్పిన గ్రామస్థులు. అమరావతి సిటీ క్యాపిటల్ కార్పొరేషన్ తీర్మానాన్నీ ఏకగ్రీవంగా వ్యతిరేకంగా బోరుపాలెం గ్రామస్థులు.

* మచిలీపట్నం పోర్టు టెండర్లు రద్దు. రెండు సార్లు పిలిచినా ముందుకు రాని కాంట్రాక్టర్లు. ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవటంతో టెండర్లు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. మొదటిసారి టెండర్లకు స్పందన రాకపోవటంతో నిభంధనల్లో మార్పులు చేసి రెండోసారి టెండర్లు. నాలుగు సార్లు గడువు పెంచినా ముందుకు రాని కాంట్రాక్టర్లు. పలు సంస్ధలతో సంప్రదించినా స్సందించని యాజమాన్యాలు.

* జగన్‌రెడ్డి పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో తక్షణమే “ఫిస్కల్ కౌన్సిల్” ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.బడ్జెట్ ఉల్లంఘనలకు తక్షణమే అడ్డుకట్ట వేయాలన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులకు, ఖర్చులకు పొంతనే ఉండడం లేదని అన్నారు. బడ్జెట్ కేటాయింపులను పక్కనపెట్టి జగన్‌రెడ్డి తోచిన విధంగా ఖర్చు చేయడం వల్లే బడ్జెట్‌కు విలువ లేకుండా పోయిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ తరహా వ్యవహారశైలి కేవలం బడ్జెట్ ఉల్లంఘనే కాదు.. చట్టసభలను అగౌరవ పర్చడమే అని అన్నారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో అవినీతి కుంభకోణాలు, ప్రజాధనం దుర్వినియోగం తప్ప అభివృద్ధే లేదని యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.

* రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌‌కు కోవిడ్ సోకింది. తనకు కోవిడ్‌కు సంబంధించిన స్వల్ప లక్షణాలున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ అయినట్లు ట్విటర్ ద్వారా తెలిపారు. తనను ఇటీవల కలిసిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని రాజ్‌నాథ్ సూచించారు.