DailyDose

TNI నేటి తాజా వార్తలు 11-01-2022

TNI  నేటి తాజా వార్తలు 11-01-2022

* అమరావతి

మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి జగన్‌ నేడు ప్రారంభించనున్నారు. రూ.18 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న అర్హులైన కుటుంబాలు ఈ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశిత మొత్తాన్ని ఏడాది కాలంలో నాలుగు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది.మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లేఅవుట్లలో అమలు చేస్తారు.

* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. నిన్న సాయంత్రం జిల్లా పవర్ పేట సమీపంలో ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్రగాయాలపాలైన 5 ఏళ్ల బాలిక. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి.

* అమరావతి

సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి

విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌కు అందజేసి, వేద ఆశీర్వచనం ఇచ్చిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి

ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు

శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.

* ఏపీ: ఈ నెల 17 నుంచి అన్ని కోర్టుల్లో ఆన్‌లైన్‌లో కేసుల విచారణ, కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో నిర్ణయం.

* రేణూ దేశాయ్, అఖీరా నందన్ లకు కరోనా పాజిటివ్.

థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకుని మాస్కులు ధరించండి.

జాగ్రత్తగా ఉండండి అంటూ రేణూ దేశాయ్ పోస్ట్.

* విజయవాడ

గుంటూరు ఎంపి శ్రీ గల్లా జయదేవ్ గారి కుమారుడు గల్లా అశోక్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘హీరో ‘ ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సందర్భంగా ఈరోజు కేశినేని భవన్ వద్ద విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని (శ్రీనివాస్) నాని గారి చేతుల మీదగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. గల్లా అశోక్ మొదటి సినిమా విజయవంతమై, సినీ రంగంలో స్థిరపడాలని ఆకాంక్షించారు.

* ఏపీలో నైట్‌ కర్ఫ్యూ అమలులో మార్పు

అమరావతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. అంతకుముందు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరుకు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.. అయితే పండగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సంక్రాంతి తర్వాత నైట్‌ కర్ఫ్యూ అమలు కానుంది.

* సంక్రాంతి తర్వాత రాత్రి కర్ఫ్యూ అమలుకు ప్రభుత్వం నిర్ణయం రాష్ట్రంలో నేటి నుంచి తలపెట్టిన రాత్రి కర్ఫ్యూ వాయిదా ఈనెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం కర్ఫ్యూపై ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వం పండుగ వేళ పల్లెలకు పెద్దఎత్తున తరలివస్తున్న ప్రజలు ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే కర్ఫ్యూ వాయిదా: మంత్రి ఆళ్లనాని.

* కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం! ఈ నెల 17 నుంచి వర్చువల్ విధానం ద్వారానే కేసుల విచారణ అన్ని కోర్టులకు ఆదేశాలను జారీ చేసిన హైకోర్టు కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో సైతం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేసులను వర్చువల్ విధానంలోనే విచారించబోతున్నట్టు స్పష్టం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 17 నుంచి వర్చువల్ విధానంలోనే కేసుల విచారణను చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో అన్ని కోర్టుల్లో విచారణ ప్రత్యక్షంగా కాకుండా, వర్చువల్ గా జరగనుంది.

* అమరావతి: ఈనెల 13 న గురువారం కూడా సంక్రాంతి పండుగ సెలవు ఇచ్చిన ప్రభుత్వం. దినితో ఈనెల 13 ,14.15.16.వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు.

* అమరావతి: చిరంజీవిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని తెలిపారు. ఇప్పుడు కూడా చిరంజీవి తనతో బాగానే ఉన్నారని చెప్పారు. రాజకీయంలో పోరాటం అనేది ఆటలో ఓ భాగమన్నారు. సినిమా టికెట్ల వివాదంలోకి టీడీపీని కూడా లాగుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీకి సినీ పరిశ్రమ సహకరించింది లేదని తెలిపారు. తాను సీఎంగా ఉన్నప్పుడు, ఈ మధ్య కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ ఈ-పేపర్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు ఏపీలో సినిమా రేట్ల వివాదంపై స్పందించారు.

* గచ్చిబౌలి లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల నిరసన ||

◆ గచ్చిబౌలి హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి సంబంధించిన భూములు కబ్జా కు గురవుతున్నాయని యూనివర్సిటీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

◆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కబ్జాలను ప్రోత్సహించడం సిగ్గుచేటని విద్యార్థులు మండిపడ్డారు.

◆ ఇప్పటికైనా యూనివర్సిటీ కి సంబంధించిన భూములను కాపాడాలని లేకపోతే ఉద్యమిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

* సైబరాబాద్..

మాదాపూర్ SOT పోలీస్ ల దాడులు.

మసాజ్ సెంటర్ లో వ్యభిచారం

నిర్వహకురాలు దుర్గాసి సుజాత..

రిసె్షనిస్ట్ సచిన్.. విటులు సతీష్ రాజకుమార్ లు అరెస్టు.

నలుగురు యువతులను రక్షించిన Sot పోలీసులు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు

లోటస్ బ్లిస్ స్పా పేరుతో వ్యభిచారo నిర్వహణ.

అనేక రకాల వ్యక్తులు.. వివిధ వర్గాల వారిని తన బుట్టలో వేసుకుని ఎన్నో రోజులు గా వ్యభిచారo సాగిస్తున్న నర్వహకురాలు సుజాత పై ఆరోపణలు.

సుజాత పై ఇప్పటికే పలు సెక్షన్ ల కింద madhapur ps లో కేసులు.

* COVID-19 UPDATE

India reports 1,68,063 fresh cases, 69,959 recoveries & 277 deaths in the last 24 hours

Active case tally reaches 8,21,446. Daily positivity rate (10.64%)

Omicron case tally at 4,461