Movies

అబద్దం చెప్పా

అబద్దం చెప్పా

ఒకప్పుడు టాలీవుడ్‌లో కథానాయికగా జోరుచూపించిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలతో బిజీ అయ్యారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు గ తేడాది తన పుట్టిన రోజు నాడు వెల్లడించి ఫ్యాన్స్‌ను సర్ర్పైజ్‌ చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీతో తన ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతూ ‘‘అతనితో ప్రేమలో ఉన్న విషయం చెప్పాక సన్నిహితుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. నేను చాలా కాలంగా జాకీతో డేటింగ్‌లో ఉన్నాను. నా స్నేహితులు, కుటుంబ సభ్యులకు మా ప్రేమ గురించి తెలుసు. కానీ అన్ని ఇంటర్వ్యూల్లోనూ నేను సింగిల్‌గా ఉంటున్నానని అబద్దం చెప్పేదాన్ని’’ అన్నారు.