DailyDose

ఫ్లాష్.. ఫ్లాష్.. పశ్చిమగోదావరిలో ఘోర ప్రమాదం

ఫ్లాష్.. ఫ్లాష్.. పశ్చిమగోదావరిలో ఘోర ప్రమాదం

తాడేపల్లిగూడెంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడ్‎తో వెళ్తున్నలారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమచారం అందుకున్న పో్లీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బోల్తాపడిన లారీ కింద మరికొందరు ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.