Business

బిల్‌గేట్స్‌పై ‘లైంగిక వేధింపులు’ ‘రాసలీలల’ ఆరోపణలు.. కీలక నిర్ణయం!

బిల్‌గేట్స్‌పై ‘లైంగిక వేధింపులు’ ‘రాసలీలల’ ఆరోపణలు.. కీలక నిర్ణయం!

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిల్‌గేట్స్‌పై లైంగిక-రాసలీలల ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణల మీద మైక్రోసాఫ్ట్‌ బోర్డు దర్యాప్తు అర్ధాంతరంగా ముగిసింది కూడా!. ఈ తరుణంలో కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని ప్రముఖ న్యాయ విచారణ సంస్థ ‘అరెంట్‌ ఫాక్స్‌ ఎల్‌ఎల్‌పీ’ని మైక్రోసాఫ్ట్‌ నియమించుకుంది. ఈ సంస్థ బిల్‌గేట్స్‌ వచ్చిన ఆరోపణలపై బోర్డు తయారు చేసిన నివేదికను సమీక్షిస్తుంది. ఆ తర్వాతే బోర్డు రూపొందించిన నివేదికను బహిర్గతం చేస్తుంది. అంటే.. బిల్‌గేట్స్‌ లైంగిక వేధింపుల విషయంలో బోర్డు దర్యాప్తు ఏం తేల్చిందన్న విషయం వేసవి దాకా బయటికి రాదన్నమాట!. ఒక్క బిల్‌గేట్స్‌ విషయంలోనే మాత్రమే కాదు.. 2019 తర్వాత మైక్రోసాఫ్ట్‌లో పని చేసే పలువురు ప్రముఖుల మీద పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లైంగిక వేధింపులు, లింగ వివక్ష, ఇతర సమస్యలపై కంపెనీ విధానాల్ని సమీక్షించాలని షేర్‌ హోల్డర్స్‌.. బోర్డును కోరారు. అందుకే అరెంట్‌ ఫాక్స్‌ను నియమించుకుంది మైక్రోసాఫ్ట్ కంపెనీ. ప్రముఖులపై వచ్చిన ఆరోపణలు నిజమా? కాదా? అనే విషయంతో పాటు కంపెనీలో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురైతే ఎలా డీల్‌ చేయబోతుందన్న విషయంపై కంపెనీ ఒక పద్ధతిని ఫాలో అవ్వాలని చూస్తోంది. అందుకే న్యాయ విచారణ సంస్థ అభిప్రాయాల్ని సేకరిస్తోంది. పనిలో పనిగా ఉద్యోగుల ఆందోళనలను, పరిష్కారాలపైనా అరెంట్‌ దృష్టి పెట్టనుంది. ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ చైర్మన్‌ పదవి నుంచి 2020 మార్చి నెలలో ఆయన దిగిపోయాడు. తన నిష్క్రమణకు కారణం ‘ఫౌండేషన్‌’ మీద ఫోకస్‌ చేయడమే అని ఆయన ప్రకటించుకున్నప్పటికీ.. అసలు విషయం కాదని వేధింపుల పర్వమే కారణమని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2007 సమయంలో సమయంలో ఉద్యోగులపై ఆయన ఈ-మెయిల్స్‌ ద్వారా వేధింపులకు పాల్పడ్డాడని, ఉమెనైజర్‌ అని, ఉద్యోగులతో ఆయన ప్రవర్తనాశైలి బాగుండేదని కాదని ఆరోపణలు రాగా.. ఈమేరకు బోర్డు ఆయన్ని పిలిచి మందలించినట్లు మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఈ కథనాల తర్వాత మైక్రోసాఫ్ట్‌ మాజీ ఉద్యోగులు కొందరు, బిల్‌గేట్స్‌ సన్నిహితులు సైతం ఆయనపై లైంగిక ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడం కొసమెరుపు.