Devotional

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ

తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఇళ్లముందు తెల్లవారు జామునే కల్లాపి చల్లి, ఎంతో అందమైన ముగ్గులను ఆడపడుచులు తమ వాకిళ్లలో అలంకరిస్తున్నారు. వాటి మధ్యలో గొబ్బెమ్మలు కొలువుదీరుతున్నాయి. హరిదాసు కీర్తనలు, బసవన్నల నాట్యాలు, పతంగుల రెపరెపలతో పల్లెల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. నిన్న భోగిమంటలు వెలిగించి పండగకు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు ప్రజలు. ఇవాళ మకర సంక్రాంతి జరుపుతున్నారు. రేపు కనుమతో సంక్రాంతి పూర్తవుతుంది.