Food

తీపి అచ్చులు.. భలే చిలకలు..

తీపి అచ్చులు.. భలే చిలకలు..

సంక్రాంతి అంటేనే రకరకాల పిండి వంటలు. నాటి సకినాలు, అరిసెలు మొదలు నేటి కోవా, బర్ఫీల వరకు అన్ని రకాల వంటలూ తయారు కావాల్సిందే. సంక్రాంతి ప్రత్యేక రుచుల్లో ఒకటి .. పంచదార చిలుక. అనేక రంగుల్లో నోరూరించే ఈ తీపి చిలుకలను చక్కెరతో తయారుచేస్తారు. వీటిని చేయడం చాలా తేలిక. చక్కెరలో కొంచెం నీళ్లు చల్లి బాగా ఉడికించి చిక్కబడ్డాక అచ్చుల్లో పోసి చల్లారనిస్తే చాలు. పంచదార చిలుకలు తయారైనట్టే. పంచవన్నెల చిలుకలు కావాలనుకుంటే చక్కెర ఉడికేటప్పుడే చిటికెడు రంగు కలుపుకోవచ్చు. వీటి తయారీకి రకరకాల ఆకారాల్లో చేసిన చెక్క అచ్చులు మార్కెట్లో దొరుకుతాయి. పేరంటాళ్లకు వాయనం ఇవ్వడానికైనా, భోగిపండ్లు పోసినప్పుడు పిల్లలకు పంచడానికైనా బావుంటాయి.