Movies

చీరాల బీచ్‏లో బాలయ్య సందడి.. భార్యతో కలిసి జీప్‌ డ్రైవింగ్‌

చీరాల  బీచ్‏లో బాలయ్య సందడి.. భార్యతో కలిసి జీప్‌ డ్రైవింగ్‌

అఖండ విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ.. ఈ సారి సంక్రాంతి వేడుకను తన సోదరి పురందేశ్వరి ఇంట్లో జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రకాశం జిల్లా కారంచేడుకు వెళ్లిన బాలయ్య.. గత రెండు రోజులుగా అక్కడే సందడిగా గడుపుతున్నారు.సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం గుర్రం ఎక్కి హంగామా చేసిన బాలయ్య.. ఆదివారం ఉదయం చీరాల బీచ్‌లో హల్‌చల్‌ చేశారు. ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా చీరాల చీచ్‌కు వెళ్లారు బాలయ్య. ఈ సందర్భంగా బాలకృష్ణ ఓపెన్ టాప్ జీప్‌ను నడిపారు. భార్య వసుంధర ఫ్రంట్‌సీట్‌లో కూర్చోగా.. తాను వేగంగా జీప్‌ను డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.