WorldWonders

కాబోయే అల్లుడికి 365 వంటలుతో ఆతిధ్యం!

కాబోయే అల్లుడికి 365 వంటలుతో ఆతిధ్యం!

గోదావరి జిల్లాలు అంటేనే మర్యాదలకు మారుపేరుగా పిలుస్తుంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఏపీలోని పలు జిల్లాలు కళకళలాడుతుంటాయి. ఇంటి ముందు గొబ్బెమ్మళ్లు..రంగు రంగుల ముగ్గులు..హరినాథుల కీర్తనలు…కోళ్ల పందాలు..పిండి వంటలతో ఘుమఘుమలాడుతుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే..పండుగ శోభతో ప్రతి పల్లె వెలిగిపోతుంటుంది. ఈ పండుగ వస్తే..కొత్త అల్లుళ్లను ఇంటికి పిలుస్తుంటారు. వారికి అతిథి..సత్కరాలు మాములుగా ఉండదు. భోజనం విషయంలో ఇప్పుడు ఓ ట్రెండ్ నడుస్తోంది. ఇంటికి వచ్చే అల్లుళ్లకు భారీ రకాల ఆహార పదార్థాలను వారి ముందు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా…కాబోయే అల్లుడిని తాతయ్య ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఒకటి కాదు…రెండు కాదు..ఏకంగా 365 రకాల వంటకాలతో అతిథ్యమిచ్చారు. అన్నం, పులిహోర, బిర్యానీలు, దద్దోజనంతో పాటు… 30 రకాల కూరలు సిద్ధం చేశారు. వివిధ రకాల పిండి వంటలు, వంద రకాల స్వీట్స్, 19 రకాల హాట్ పదార్థాలున్నాయి. అంతేగాకుండా…15 రకాల ఐస్‌క్రీమ్స్, 35 రకాల డ్రింక్స్, 15 రకాల కేకులు, 35 రకాల బిస్కెట్లతో ఓ రేంజ్‌లో మర్యాద చేశారు. కేవలం ఆహార పదార్థాలను టేబుల్‌పై సిద్ధం చేయడమే కాదు. అన్ని రకాల పదార్థాలను కుటుంబం అంతా దగ్గరుండి మరీ కాబోయే అల్లుడికి రుచి చూపించారు. వారు చూపించిన అతిథ్యానికి కాబోయే అల్లుడు ఫిదా అయిపోయాడు.