Devotional

నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు

*శుభోదయం* *17.01.2022* *నేటి రాశి ఫలాలు*

*_మేషం_* మీమీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. అధికారుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. కుటుంబ సహకారం ఉంటుంది. *ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.* 

*_వృషభం_* ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త  వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. *_ఇష్టదైవ నామాన్ని జపిస్తే మంచిది._* 

*_మిధునం_*ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాల వల్ల మంచి జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సమయానికి నిద్రాహారాలు అవసరం. *_శివారాధన శుభప్రదం._*

*_కర్కాటకం_* అనుకూల వాతావరణం ఉంటుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. *_గణనాయకాష్టకం పఠిస్తే మంచిది._*

*_సింహం_*అనుకున్న పనిని వెంటనే పూర్తిచేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. ప్రశాంతమైన జీవనం ఉంది. *_లక్ష్మీ ఆరాధన మంచిది._*

*_కన్య_* భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. *_శివారాధన శుభప్రదం._*

*_తుల_*ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయసహకారాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్త. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. *_శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శక్తిని ఇస్తుంది._*

*_వృశ్చికం_*భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. *_సాయిబాబా సచ్చరిత్ర పఠిస్తే బాగుంటుంది._* 

*_ధనుస్సు_* ప్రారంభించే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తినిస్తాయి. *_ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది._*  

*_మకరం_*దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల విషయమై పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. *_ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.  _*

*_కుంభం_*మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. *_గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది._*

*_మీనం_*శరీరసౌఖ్యం కలదు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. *సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.*