NRI-NRT

కెనడాలో TCA సంక్రాంతి వేడుకలు

కెనడాలో TCA సంక్రాంతి వేడుకలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో శనివారం నాడు సంక్రాంతి వేడుకలు అంతర్జాలంలో నిర్వహించారు. సహాయ కార్యదర్శి జితేందర్ సతీమణి కాంతి దీప ప్రజ్వలన చేసి సంబరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమములో భోగి పళ్ళు, పిల్లలు సంప్రదాయ వేడుకలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు, ఈ ముగ్గుల పోటీలకు ఉమా సలాడి, జయ కందివనం న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇండియా కన్సుల్టే జనరల్ టొరంటో అపూర్వ శ్రీవాస్తవ హాజరయి సంస్థకు అభినందనలు తెలిపారు. అధ్యక్షుడు రాజేష్ సభికులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
కెనడాలో TCA సంక్రాంతి వేడుకలు