DailyDose

ఇంటి అద్దె కట్టలేని స్థితిలో భారత మాజీ ప్రధాని

ఇంటి అద్దె కట్టలేని స్థితిలో భారత మాజీ ప్రధాని

*ఇంటి అద్దె కట్టలేక నడిరోడ్డుపై సామాన్లతో విసిరి వేయబడ్డ ఆ వ్యక్తి మన దేశానికి రెండు సార్లు ప్రధానమంత్రిగా చేసిన మహనీయుడు అంటే నమ్మగలరా? ఎవరికైనా ఒక పదవి అనుకోకుండా వస్తే ఆ పదవిని ఎలా స్థిరపరచుకోవాలా అని ప్రజాప్రతినిధులు ఆలోచించే కాలంలో, రెండుసార్లు ఆపద్దర్మ ప్రధాన మంత్రిగా వ్యవహరించినా ఆ తర్వాత పార్టీ పెద్దలు ఎవరిని ఆ స్థానంలో కూర్చోపెట్టాలనుకుంటే వారికి బాధ్యతలు అప్పగించి తప్పుకుని తనకు ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో అమలుచేసిన ఏకైక వ్యక్తి *గుల్జారీలాల్ నందా*

చైనా దాడి తర్వాత భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆరోగ్యం క్షీణించి నురణించినప్పుడు తాత్కాలిక ప్రధానిగా 14 రోజులు పనిచేశారు నందా. తిరిగి పాకిస్తాన్తో యుద్ధం ముగిసి, శాంతి ఒప్పందం మీద సంతకం చేసిన మరుసటి రోజే అనూహ్య పరిస్థితిలో లాల్ బహదూర్ శాస్త్రి మరణించినపుడు తిరిగి ఆపద్ధర్మ ప్రధానిగా 14 రోజులు పని చేసిందీ నందానే.అంతేకాక కేంద్రంలో కీలక శాఖలయిన విదేశాంగ, అంత ర్గత వ్యవహారాలను నిర్వ హించిన ఆ నాయకుడికి చివరికి సొంత ఇల్లుగాని, కారు గాని లేదు. ఒకసారి మంత్రి వర్గంలో నుండి తప్పుకున్న తరువాత తిరిగి రాజకీయాల జోలికి వెళ్ళలేదు ఆయన.తాను నమ్మిన గాంధీసిద్ధాంతాలకు అనుగుణంగాతన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకత్వం అందించారు.
అత్యంత సామాన్య జీవితం కొనసాగించిన అతికొద్దిమందిలో గుల్జారీలాల్ నందా ఒకరు. నేడు పాకిస్తాన్లో ఉన్న సియల్ కోటలో జూలై 4, 1898లో ఒక పంజాబీ కుటుంబంలో గుల్జార్ లాల్ నందా జన్మించారు.

లాక్, అమృత్సర్, ఆగ్రా, అలాబాద్లలో చదువుకుని 1921 నాటికే బొంబాయిలోని నేషనల్ కాలేజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ అయ్యారు.ఆయనకిష్టమైన అంశం కార్మికులు ,వారి ఆర్థిక సంక్షేమం, గాంధీజీ ఇచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమం పిలుపునందుకుని ఉద్యోగం వదిలి కార్మిక రంగంలో నాయకుడిగా ఎదిగారు.
కాంగ్రెస్పార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేసిన గుల్జారీలాల్ నందా 1937లో బొంబాయి ప్రభుత్వంలో కార్మికమంత్రిగా పనిచేసి కార్మికులకు మేలుచేసే లేబర్ డిస్ప్యూట్ బిల్ తీసుకువచ్చారు. కాంగ్రెస్పార్టీ కార్మికసంఘం ఐ.ఎన్.టి.యు.సి.కి ఆయన అధ్యక్షుడు గా వ్యవహరించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా పని చేశారు. ఆ తర్వాత ప్రణాళికా శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో విద్యుత్ నీటిపారుదల హోంశాఖ లతోపాటు కీలకమైన విదేశాంగ శాఖను నిర్వహించిన చరిత్ర ఆయనది. జవహర్ లాల్ నెహ్రూ లాల్ బహుదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ మంత్రివర్గాల్లో పనిచేసిన ఘనత ఆయన సొంతం.1952 నుండి 1962 ఎన్నికల వరకు ఆయన బొంబాయి, గుజరాత్ లోని సబర్ కాంత నియోజకవర్గాల నుండిప్రాతినిథ్యం వహించారు. 1967 తర్వాత రాజకీయాలకు దూరంగా జరిగారు. ఆయనకు ముగ్గురు కొడుకులు,రాజకీయాలకు దూరంగా వారిని పెంచారు. పిల్లలకు భారం అవటంకాని, వారిమీద ఆర్థికంగా ఆధారపడటం కాని గుల్జారీలాల్ నందాకి ఇష్టంలేదు. అలాగని ఆయనకంటూ మరో ఆదాయం లేదు.పార్లమెంట్ సభ్యులకు, మంత్రులకు పెన్షన్లు ఇవ్వ టం ఇటీవలి కాలంలో మొదలైంది. అంతకుముందు ప్రజాప్రతినిధులు ప్రజాసేసకులుగా త్యాగాలు చేస్తూ. జీవించేవారు. అందుకే గుల్జారీలాల్ అపార్ట్మెంట్ భార్యతోసహా ఏకాకిగా మిగిలిపోయారు. అప్పుచేయట మునేది ఆయన వ్యక్తిగత సిద్ధాంతాలకు వ్యతిరేకం.

ఇంటి అద్దె చెల్లించేందుకు డబ్బులుండేవికావు. దినవారీ ఖర్చులకు చేతిలో రూపాయి లేదు.అటువంటి సమయంలో గుల్జారీలాల్ నందా మిత్రుడు ఒకరు స్వాతంత్ర్య సమరయోధులకు ప్రభు త్వం ఇచ్చే పింఛను విషయం తెలుసుకుని ఆ విషయం నందాకి చెప్పాడు. కాని పింఛను ఆశించి పోరాటంలో పాల్గొనలేదని వందా తిరస్కరించారు.అయితే ఆయన మిత్రులు చాలామంది కలిసి నందాచేత బలవంతంగా సంతకం పెట్టించి ఆ పింఛను అలాంటి నాయకుడిని మరల భారతదేశం చూడ దరఖాస్తును ప్రభుత్వానికి సమర్పించారు. ఇదంతా పూర్తయ్యేసరికిఆయనకు దాదాపుగా 85 ఏళ్ళు వచ్చాయి. కాలంతోపాటే గుల్జారీలాల్ని రాజకీయ నాయకులు మరచిపోయారు. ఆయన ‘సేవలు. అందించిన కార్మికరంగంలోకి కొత్త: నాయకులొచ్చారు.ఐ.ఎస్.టి.యు.సి.లో ప్రారంభం నుండి పనిచేసిన నందా గురించి ఆ సంఘసభ్యులకే తెలియని పరిస్థితి.  చివరికి నందా జీవితం ప్రభుత్వం నుండి వచ్చే నెలవారీ రూ. 500 పెన్షన్ మీద ఆధారపడింది.

ఆరోగ్య సమస్యలు అంతగా లేవు, నియమబద్ధ జీవితం కాబట్టి ఆరోగ్యంతో జీవించారు. అపార్ట్మెంట్లో ఒక్కడే బ్రతుకుతుండేవారు, తాను అద్దెకిచ్చిన ఇంట్లో ఉంటున్న సన్నని వ్యక్తి ఒక నాడు కేంద్రంలో మంత్రి అనిగాని, దేశానికి ఆపద్దర్మ ప్రధానిగా పనిచేశాడనిగాని ఇంటిఓనరికి తెలియదు, అద్దెకుండే సాదాసీదా మధ్యతరగతివారితో వ్యవహరించినట్టే నందాతో వ్యవహరించేవాడు.
అద్దె సరిగా కట్టటంలేదని అరిచేవాడు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమని బెదిరించేవాడు. అన్నింటినీ నందా మౌనంగా భరించారే కాని తన గత హోదా గురించి. మాటమాత్రం చెప్పలేదు.
మీఅద్దె అణా సైపలతో తప్పకుండా చెల్లిస్తానని చేతులెత్తి దండం పెట్టేవారంతే, డబ్బు ఏమాత్రం వెసులుబాటయినా ముందుగా ఇంటి ఓనర్ కి కట్టేవారు. సరే కదా అని ఇంటి ఓనర్ పూరుకున్నాడు. ఒకసారి వరసగా కొన్ని నెలలు అద్దె కట్టకపోవటంతో ఇంటి ఓనర్కి కోపమొచ్చి అద్దెకింద ఇంట్లోని వస్తువులు తీసుకుందామని వెళితే అక్కడ కనిపించింది ఒక పాతపరుపు, చాప, కొన్ని వంటపాత్రలు తప్పించి మరేమీ లేవు.అవి చూసి ఓనర్ కి అర్థమైంది ఈయన. ఇక అద్దెకట్టలేడని. అంతే ఇంటిలోని సామానుని బయటకు నిసిరివేసి, నందాని కూడా బయట రోడ్డుమీద నిలబెట్టాడు. చుట్టూ సామానుతో మధ్యలో నిలుచున్న బక్కపల్చని వ్యక్తి ఎవరో పత్రికా ఫోటోగ్రాఫర్కి తెలి యదు. ఐనా ఆ దృశ్యం బాగుందని క్లిక్ చేసి ఎడిటర్కి చూపించినప్పుడుగాని ఆ వ్యక్తి గుల్జారీలాల్ నందా అని. తెలియలేదు. ఆ వార్త సంచలనమైంది.

ప్రభుత్వం మేల్కొన్నది. అధికార యంత్రాంగం కదిలి గుల్జారీలాల్ నందాకి తగిన ఉచిత గృహం ఇస్తాననీ ముందుకు వచ్చింది. అప్పుడు ఆయన వయసు 94 ఏళ్ళు.
ఆ సమయంలో కూడా ప్రభుత్వ సహాయాన్ని సవినయంగా తిరస్కరించారు. ఆ సంఘటనతో ప్రజలకు గుల్జారీలాల్ బ్రతికేవున్నారన్న విషయం తెలిసింది. అటువంటి నిజాయితీ గలిగిన నాయకుడు ఒకరు దేశంలో జనించివున్నాడని.అలా తన చివరి రోజుల వరకు గాంధేయమార్గంలోనే జీవించిన గుల్జారీలాల్ నందా జనవరి 15, 1998లో ఢిల్లీలో మరణించారు. ఆయన మరణానికి ఒక సంవత్సరం ముందు గుల్జారీలాల్ నందాని భారతరత్న బిరుదుతో సత్కరించింది. భారత ప్రభుత్వం.. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా నందా గారికి నివాళులర్పిస్తూ…