DailyDose

TNI నేటి తాజా వార్తలు – 17/01/2022

TNI నేటి తాజా వార్తలు – 17/01/2022

*17 నుండి శ్రీ సత్య సాయి సూపర్ హాస్పిటల్ లో  వైద్య సేవలు బంద్.
ట్టపర్తి లో కోవిద్ ఉద్ధృతి నేపథ్యంలో… వైద్యం కొరకు  ఇతర రాష్ట్రాల నుండి హాస్పిటల్ కు వచ్చే రోగులకు.. తాత్కాలికంగా.. వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటనలో పేర్కొన్నారు. వారం రోజులుగా ఇతర రాష్ట్రాల నుండి పుట్టపర్తికి వస్తున్న వారికి … అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవడంతో.. నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తదుపరి ప్రకటన వెలువడే వరకు.. సుదూర ప్రాంతాల వాసులకు వైద్య  సేవలు లభించవు.   అయితే పుట్టపర్తి పరిసర వాసులకు మినహాయింపు ఇచ్చారు. కోవిద్ టెస్ట్ రిపోర్ట్ తో.. స్థానిక మండల ప్రజలు, సూపర్ హాస్పిటల్ లో  వైద్య సేవలు వినియోగించుకోవచ్చు.  గడిచిన రెండు రోజుల్లో  పట్టణంలో 100 కు పైగా కేసులు నమోదు అవ్వడం కలవరపెడుతోంది.మరోవైపు పట్టణంలో మాస్కులు లేని  వారిపై అధికారులు   ప్రత్యేక చర్యలు చేపట్టారు. పెనాల్టీ విధించారు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యాధికారులు సూచిం చారు. అవసరమైతే తప్ప జనావాస  ప్రాంతంలో సంచరించరాదని  హెచ్చరించారు

*కాంగ్రెస్, బీజేపీ సహా పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారంనాడు ఎన్నికలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది.

*గుంటూరు జిల్లాలో ఒక్క రోజులోనే కేసులు విపరీతంగా పెరిగాయి. వారం నుంచి క్రమక్రమంగా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య పెద్దగా లేదు. దీంతో వైరస్‌ విస్తరణను అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. సంక్రాంతి మూడు రోజులు పండుగ ముగిసిన తర్వాత ఒక్కసారిగా సోమవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి కరోనాతో వచ్చిన రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆదివారం వరకు కేవలం 30 మంది లోపే చికిత్స పొందుతుండగా 100 బెడ్లను కేటాయించారు. సోమవారం మొత్తం బెడ్లు నిండిపోవడంతో అప్రమత్తమైన అధికారులు అప్పటికపుడు జనరల్‌ మెడిసిన్‌ విభాగంలోని మరో రెండు వార్డులను ప్రత్యేకంగా కేటాయించారు. సోమవారం రాత్రికి ఆ బెడ్లు కూడా నిండిపోయే పరిస్థితులున్నాయి. ఇక సోమవారం నుంచి తెరుచుకున్న విద్యాసంస్థలకు 30 శాతమే విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కువ ప్రాంతాల్లో కరోనా కేసులు వెలుగు చూడటంతో తల్లిదండ్రులు కూడా సోమవారం పాఠశాలలకు పంపించేందుకు సుముఖత చూపలేదు. 

 *నదిలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

* సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండలం అడ్లూరు కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైనారు..అడ్లూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఉదయం 6 గంటల సమీపం లో సరదాగా చేపల వేటకు కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లి గల్లంతు అయినట్లు స్థానికులు తెలిపారు..గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  *హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు జనాలు. నేటి నుంచి ఆఫీస్ లు తెరుచుకోవడం తో సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్నారు జనాలు.ఈ నేపథ్యంలోనే… హైదరాబాద్ – విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరిగి పోయింది. రద్దీ దృష్ట్యా పంతంగి టోల్ ప్లాజా , కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద అదనపు టోల్ చెల్లింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు సాధారణం కంటే హైవేపై రెట్టింపు వాహనాలు వస్తున్నాయి.  దీంతో అధికారులు దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అటు సొంతూళ్ల నుంచి.. హైదరాబాద్‌ కు వచ్చే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా 3500 బస్సులను ఏర్పాటు చేసింది.కాగా.. అటు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో… తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థల సెలవులను పెంచేసింది కేసీఆర్‌ సర్కార్‌.

*  జనవరి 16 వ తేదీతో ముగియాల్సిన సంక్రాంతి సెలవులు.. కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయంతో.. జనవరి 30 వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి.

* కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy గారికి లేఖ రాసాను. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయి.

*15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ణాలతో చెలగాటమాడోద్దు. తల్లిదండ్రులను మరింత మానసిక ఆందోళనకు గురిచెయ్యకుండా ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలి.
*యాచారంలో మళ్లీ చిరుత కలకలం మండలంలోని నంది వనపర్తి అనుబంధ గ్రామమైన పిల్లిపల్లిలో చిరుతపులి కలకలం రేపుతుంది. గ్రామానికి శివారులోని పొలంలో రాత్రి సమయంలో చిరుత పులి తన పొలంలో కట్టివేసినా ఆవు దూడను చంపి తినేసి వుంటుందని రైతు యెరుకలి బిక్షపతి గౌడ్ ఆవెదన వ్యక్తం చేస్తున్నారు! భయాందోళనలో ప్రజలు

*ఏపీ సీఐడీ పోలీసులకు ఎంపీ రఘురామ లేఖఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులకు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ‘‘అనారోగ్యం వల్ల విచారణకు హాజరుకాలేను. దిల్లీ వెళ్లాక అనారోగ్యానికి గురయ్యాను. విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలి’’ అని సీఐడీ పోలీసులకు రాసిన లేఖలో రఘురామ కోరారు. కాగా ఈరోజు సీఐడీ విచారణకు రఘురామ హాజరు కావాల్సి ఉంది. ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కొన్ని రోజుల ముందు సీఐడీ అధికారులు రఘురామకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

*తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశించింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని తెలిపింది.కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం చర్చిస్తున్నట్లు ఏజీ వెల్లడించారు. దీంతో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులపై విచారణ ఈనెల 25కు వాయిదా వేసింది.మరోవైపు హైకోర్టులో రేపట్నుంచి వర్చువల్‌గా కేసుల విచారణ జరగనున్నాయి. ఆన్‌లైన్‌లోనే పూర్తిస్థాయి విచారణలు చేపట్టనుంది. కొవిడ్‌ వ్యాప్తి వల్ల మళ్లీ వర్చువల్‌ విచారణలు జరపనుంది.