Sports

బీబీసీపై బ్రిటన్‌ కొరడా!

బీబీసీపై బ్రిటన్‌ కొరడా!

ప్రపంచ వ్యాప్తంగా వార్తలను ప్రసారం చేసే బీబీసీ నెట్‌వర్క్‌పై బ్రిటన్‌ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. రెండేళ్లపాటు లైసెన్స్‌ ఫీజును నిలుపుదల చేసింది. ప్రజల జీవన వ్యయం తగ్గించడానికి, మీడియా పరిధిని మరింత మార్పు చేయడానికి, కొత్త నమూనా అవసరమని భావించడం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ప్రజలు టిలివిజన్‌ నెట్‌వర్క్‌ కోసం ఏడా 190 యూరోలు చెల్లిస్తున్నారని.. ఇది రెండేళ్ల వరకు నిర్ణయించిన ధరగా సాంస్కృతిక శాఖ మంత్రి నడినో డోరీస్‌ పార్లమెంటులో పేర్కొన్నారు. ఇది సాధారణ ప్రజలపై భారం మోపుతోందని పేర్కొన్న ఆమె ద్రవ్యోల్బణం ఆధారంగా తదుపరి నాలుగేళ్లకు ధరల నిర్ణయం జరుగుతుందన్నారు.అయితే.. విపక్షాలు దీనిని తీవ్రంగా విమర్శించాయి. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను రక్షించుకునేందుకే ప్రభుత్వం బీబీసీపై చర్యలు తీసుకుందని విమర్శించాయి. ప్రభుత్వంపై విమర్శలను సహించలేకే.. ఈ నిర్ణయం తీసుకున్నారని లేబర్‌ మీడియా అధికార ప్రతినిధి లక్కీ పావెల్‌ అన్నారు. ‘‘లెసెన్స్‌ ఫీజు జీవన వ్యయంపై ప్రభావం చూపుతుందనా లేక.. బీబీసీపై సుదీర్ఘకాల ప్రతీకారంతోనే ఇలా చేస్తున్నారా?’’ అని ఆమె దుయ్యబట్టారు.