DailyDose

TNI నేటి నేర వార్తలు – 18/01/2022

TNI  నేటి నేర వార్తలు – 18/01/2022

* పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్క్ షో సినిమా హాలు‌లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున పొగలు చుట్టుపక్కల కమ్ముకోవడంతో జనం భీతావహులయ్యారు. ఐదు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటానా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్నిప్రమాదానికి కారణం కానీఎవరైనా గాయపడ్డారాఆస్తి నష్టం ఎంత జరిగి ఉండచ్చనే వివరాలు వెంటనే తెలియలేదు.
* ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై ఫిరోజ్‌ అనే యువకుడు అత్యాచారందాడి చేశాడు.ఈ సంఘటన తిరుమలాయపాలెం మండలం జూపేడలో జరిగింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని యువతిని ఫిరోజ్ తల్లిదండ్రులు బెదిరించారు. ప్రస్తుతం బాధితురాలు ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని బాధితురాలి ఆవేదన వ్యక్తం చేసింది.
* అమరావతి నదిలో స్నానానికి వెళ్లిన ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తారాపురం ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.
* జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో ఆదివారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు ఇళ్ల ముందు విచిత్రమైన ముగ్గులు, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేశారు. కాలనీవాసులు సోమవారం ఉదయం లేచి చూసేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కన్పించడంతో ఆందోళన చెందుతున్నారు.
* అనంతపురం జిల్లా పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో దొంగలు పడ్డారు. దాదాపు రూ. కోటి విలువ చేసే శ్రీగంధం చెక్కలతో పాటు, 16 కేజీల శ్రీగంధపు నూనె డబ్బాలను అపహరించుకుపోయారు. ఆదివారం ఓ అజ్ఞాతవ్యక్తి ఇచ్చిన సమాచారంతో.. సోమవారం జిల్లా అటవీశాఖాధికారి సంపత్‌ కృపాకర్‌ కార్యాలయానికి చేరుకుని పరిశీలించారు.
* ఓ వివాహితపై భర్తతోపాటు అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో జరిగింది. ఓ వివాహితపై ఆమె భర్త, అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం చేసి,ఆమె ప్రైవేటు భాగంపై సిగరెట్లతో కాల్చి చిత్రహింసలకు గురిచేశారని పోలీసులు తెలిపారు.ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులుతెలిపారు.
* కన్నడ ఛానెల్‌లో ‘నన్నమ్మ సూపర్‌ స్టార్‌’ రియాల్టీ షోలో రాణిస్తున్న ఆరేళ్ళ చిన్నారి సమన్వి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా శుక్రవారం అంత్యక్రియలు జరిపారు.
* రాజస్థాన్ రాష్ట్రంలో మరో నిర్భయ ఘటన జరిగింది. అల్వార్ జిల్లాలో పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేయడంతోపాటు ఆమె ప్రైవేటు భాగంలో పదునైన వస్తువులను చొప్పించిన దారుణ ఘటన జరిగింది. అల్వారా పట్టణంలోని తిజారా ఫ్లైఓవర్ కింద పదహారేళ్ల బాలిక రక్తపు మడుగులో పడి ఉండగా పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను జైపూర్ నగరంలోని జేకే లోన్ ఆసుపత్రికి తరలించారు.బాధిత బాలికకు రక్త స్రావం ఆగకపోవడంతో వైద్యులు రెండున్నర గంటలపాటు ఆపరేషన్ చేశారు.
* కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ఆదివారం రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రభుత్వం అమలు చేసింది. దీనిని విజయవంతం చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ ఆంక్షలను విధిగా పాటించాలని, అనవసరంగా రోడ్లపై తిరగొద్దని పదేపదే హెచ్చరికలు చేశారు. కానీ, చాలామంది రోడ్లపై యధేచ్చగా తిరిగారు. ఇలాంటివారిని గుర్తించి మొత్తం 3,174 మందిపై కేసులు నమోదు చేసి, వారికి రూ.6,34,800ల అపరాధం విధించారు. అదేవిధంగా 1112 మోటార్‌ సైకిళ్లను, 49 ఆటోలు, 40 మినీ వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* కోయంత్తూరులో కుమార్తెకు విషమిచ్చి హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
* వెండి కడియాల కోసం ఓ మహిళ కాళ్లు నరికి చంపిన దొంగ బాగోతం రాజస్థాన్ రాష్ట్రంలోని చార్‌భుజా గ్రామంలో తాజాగా జరిగింది. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లా చార్‌భుజా పోలీస్ స్టేషన్ పరిధిలోని పొలంలో 45 ఏళ్ల మహిళ మృతదేహం నరికివేసిన పాదాలతో పడి ఉండగా పోలీసులు కనుగొన్నారు.ఘటన సమయంలో మహిళ ధరించిన వెండి కడియాలను దొంగిలించేందుకు ఓ దొంగ ఆమె పాదాలను నరికి చంపాడని పోలీసులు తెలిపారు.
* రాజస్థాన్‌ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌ నగరంలో లగ్జరీ సెడాన్ కారు బైక్‌లపై దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు.లగ్జరీ కారు రోడ్డు పక్కన ఉన్న పెంకుటిల్లుపైకి వెళ్లే ముందు పలు ద్విచక్ర వాహనాలపై నుంచి దూసుకెళ్లింది.ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి.