Politics

ప్రగతి భవన్ ముందు జేసీకి అవమానం

ప్రగతి భవన్ ముందు జేసీకి అవమానం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తానంటూ ప్రగతిభవన్‌కు వచ్చిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి అవమానం జరిగింది. అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. సీఎం లేకపోతే మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ జేసీ అన్నారు. అయినా అనుమతి కావాల్సిందేనని చెప్పడంతో చేసేదేమీలేక జేసీ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఎవరైనా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలవాలన్నా, ప్రగతి భవన్‌కు వెళ్లాలన్నా ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకుంటే తప్ప వాళ్లను లోపలికి పంపరు. అయితే జేసీ ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేనిదే తాము లోపలికి పంపబోమని స్పష్టం చేశారు. అనుమతైనా ఉండాలి.. లేదా ప్రగతి భవన్ నుంచి పెద్దలతో ఫోన్ అయినా చేయించాలని జేసీకి సెక్యురిటీ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అయితే తనకు అపాయింట్‌మెంట్ ఇచ్చేదేమిటని, తాను లోపలకు వెళతానని సెక్యూరిటీతో జేసీ వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ అపాయింట్‌మెంట్ లేనిదే తాము లోపలికి అనుమతించబోమని సెక్యూరిటీ నచ్చచెప్పడంతో చేసేదేమీలేక జేసీ దివాకర్ రెడ్డి వెనుదిరిగారు.