Devotional

నేటి రాశిఫలాలు 20/01/2022

నేటి రాశిఫలాలు

*శుభోదయం* *20.01.2022* *నేటి రాశి ఫలాలు*
*_మేషం_*ధర్మసిద్ధి ఉంది. సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. ఆటంకాలు ఎదురవకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. *ఈశ్వరధ్యానం శుభప్రదం.* 

*_వృషభం_* వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. *నవగ్రహ ఆరాధన శుభప్రదం.* 

*_మిధునం_*కాలానుగుణంగా ముందుకు సాగండి. అనుకున్నది సిద్ధిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. *దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.* 

*_కర్కాటకం_* మిశ్రమ కాలం. అప్రమత్తముగా ఉండాల్సిన సమయం. కీలక విషయాల్లో శ్రద్ధను పెంచాలి. సందర్భానుసారంగా ముందుకు సాగండి. బంధుమిత్రుల సలహాలు మేలైన ఫలితాన్ని ఇస్తాయి.  మొహమాటంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి. *శివాలయ సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.* 

*_సింహం_*కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసివచ్చే కాలం. అంతా శుభమే జరుగుతుంది. *ఇష్టదైవారాధన శుభప్రదం.* 

*_కన్య_*కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు అవసరం అవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. *చంద్రశేఖరాష్టకం చదవాలి.* 

*_తుల_* ఒక శుభవార్త వింటారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. విందూవినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. *ఇష్టదైవారాధన మంచిది.* 

*_వృశ్చికం_*‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి. అవసరానికి తగిన సాయం అందుతుంది. శత్రువుల విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలలో మీరు అనుకున్నదాని కన్నా ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. *సూర్య ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.* 

*_ధనుస్సు_*ప్రారంభించిన పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర విషయాల పట్ల దృష్టి తగ్గించి, సమయాన్నిసద్వినియోగం చేసుకోవాలి. *ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.*   

*_మకరం_*ధర్మసిద్ధి ఉంది. ఏకాగ్రతతో పనిచేయండి అనుకున్నది సాధిస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. *ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.* 

*_కుంభం_*ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. *శివనామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.* 

*_మీనం_*అనుకున్న పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు.విందూ వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. *ఇష్టదేవతా  శ్లోకాన్ని చదవాలి* .