DailyDose

నేటి తాజా వార్తలు – 19/01/2022

నేటి తాజా వార్తలు – 19/01/2022

**కాల్పులు కలకలం.. రామచంద్రాపురం సర్పంచ్పై దుండగుల దాడి

* శ్రీకాకుళంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రామచంద్రాపురం సర్పంచ్‌ వెంకటరమణమూర్తిపై దుండగులు కాల్పులు జరిపారు. తూటలు వెంకటరమణ పొట్టను రాసుకుంటూ వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది.

*శ్రీకాకుళం జిల్లా గార మండలంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. రామచంద్రపురం గ్రామ సర్పంచ్ వెంకటరమణమూర్తిపై అర్ధరాత్రి దుండగులు కాల్పులు జరిపారు. మరురానగర్లోని ఆయన కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ రాత్రి వెళ్లింది. ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను వెంటతీసుకెళ్లింది. వీరి మధ్య సంభాషణలు జరుగుతుండగా ఆమెతో వచ్చిన వ్యక్తులు తుపాకితో రెండుసార్లు కాల్పులు జరిపి  అక్కడ నుంచి పరారయ్యారు.

*ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఘనంగా వీడ్కోలు
కృష్ణా జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం 6 గంటలకు నూజివీడు రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో విశాఖపట్టణం బయలుదేరిన భారత ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడుకి నూజివీడు రైల్వే స్టేషన్ లో  ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ జిల్లా కలెక్టర్ జె నివాస్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ రైల్వే డి ఆర్ ఎం శివేంద్ర మోహన్ .  ప్రోటోకాల్ డైరెక్టర్ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి అడిషనల్ డైరెక్టర్ శర్మ నూజివీడు ఆర్టీవో కే రాజ్యలక్ష్మి డి ఎస్ పి బి శ్రీనివాసులు, రెవిన్యూ, పోలీస్, రైల్వే సిబ్బంది ప్రభృతులు పాల్గొన్నారు.

*తూటాలు వెంకటరమణ పొట్టను రాసుకుంటూ వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చిన దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ మహేంద్ర తెలిపారు.

*శ్రీకాకుళం జిల్లాలో  కాల్పుల కలకలం సర్పంచ్ పై కాల్పులు జరిపిన దుండగులు ఘటనాస్థలంలో రెండు బుల్లెట్లు లభ్యం గార మండలం సర్పంచ్  వెంకటరమణ పై కాల్పులు జరిపిన దుండగులు సర్పంచ్ కు గాయాలు…

*కృష్ణాజిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం 6 గంటలకు నూజివీడు రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో విశాఖపట్టణం బయల్దేరిన  భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు కి నూజివీడు రైల్వే స్టేషన్ లో వీడ్కోలు పలికిన  రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్.

*ములుగు జిల్లా లో జరిగిన ఎన్ కౌంటర్ పై  JMWP డివిజన్ కమిటి పత్రికా ప్రకటన….కెర్రగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటర్…ఎన్కౌంటర్ ను నిరసిస్తూ జనవరి 22 ములుగు జిల్లా బందుకు పిలుపు…ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించి విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు..ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్లిన మావోయిస్టులపై విచక్షణా రహితంగా పోలీసులు కాల్పులు జరిపారు…ఇన్ఫార్మర్స్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కాల్పులు జరిపారు..వాస్తవాలను వెలుగులోకి రాకుండా పోలీసులు చూస్తున్నారు…ఘటనాస్థలానికి మీడియాను కూడా అనుమతించకుండా పోలీసులు మీడియా పాత్ర పోషిస్తున్నారు..నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు అమరులైయ్యారు…వీరిలో  వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత అలియాస్ మడకం సింగ్, భూపాలపల్లి జిల్లా కు చెందిన కొమ్ముల నరేష్, దంతేవాడ జిల్లా కు చెందిన కోవాసి మూయాల్,అమరులైన మావోలకు విప్లవ జోహార్లు

* కడెం మండలంలోని పెద్ద బెళ్ళల్ గ్రామ సమీపంలో గోర రోడ్డు ప్రమాదం,కడెం నుండి బోర్ణపల్లి వైపు 6గురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బెళ్లల్ చెరువు వద్ద ఉన్న పిల్ల  కాలువలో బోల్తా,ముగ్గురు మృతి,మరో ముగ్గురికి తీవ్ర గాయాలు,ఆసుపత్రికి తరలింపు.

*గోవాలో ‘కుల’ ఆయుధాన్ని ఎక్కుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ.. సీఎం అభ్యర్థిగా పాలేకర్బండారి సామాజిక వర్గం నుంచి ఎంపికగోవా జనాభాలో వీరి ప్రాతినిధ్యం 35 శాతంకుల రాజకీయాలు చేయడం లేదన్న కేజ్రీవాల్అధికారమిస్తే అవినీతిని తుడిచేస్తామని ప్రకటనఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ స్వతహాగా మంచి వ్యూహకర్త, తెలివైనవారు. ఢిల్లీతో మొదలు పెట్టి.. ఆప్ ను దేశవ్యాప్తం చేసే దీక్షలో ఆయన సాగిపోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పంజాబ్ లో ప్రజాదరణ పెంచుకుంటున్నారు. అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల నుంచే ఓటింగ్ తీసుకుని భగవంత్ మన్ ను ఎంపిక చేశారు. తద్వారా ముఖ్యమంత్రి ఎంపిక అవకాశాన్ని ప్రజలకు ఇచ్చి, వారి మనసులో ఆప్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే పాచిక ఉపయోగించారు. అలాగే, గోవా రాష్ట్రంలో శక్తిమంతమైన బండారి (ఓబీసీ) సామాజిక వర్గానికి చెందిన పాలేకర్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. తద్వారా కుల ఆయుధాన్ని ఎక్కు పెట్టారు. ‘‘అమిత్ పాలేకర్ వృత్తిరీత్యా న్యాయవాది. బండారి సామాజిక వర్గానికి చెందిన వారు. గోవా జనాభాలో బండారి కమ్యూనిటీ జనాభా 35 శాతంగా ఉంది. ఈ సామాజిక వర్గం నుంచి గతంలో ఒక్కరే రవి నాయక్ రెండేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మేము కుల రాజకీయాలు చేయడం లేదు. బండారి కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలే రాజకీయాలు సాగిస్తున్నాయి’’ అంటూ తన ప్రకటనతో పార్టీ వ్యూహాన్ని బయటపెట్టారు. రాష్టంలో ప్రస్తుత పరిస్థితికి పాత పార్టీలే కారణమంటూ ఆప్ ను గెలిపించాలని కేజ్రీవాల్ గోవా ప్రజలను కోరారు. రాష్ట్రంలో అవినీతిని పాలేకర్ తుడిచేస్తారని, ప్రతి ఒక్కరి కోసం కష్టపడి పనిచేస్తారని ప్రకటించారు. అమిత్ పాలేకర్ గతేడాది అక్టోబర్ లో ఆప్ లో చేరడం గమనార్హం.

*గోవా ఆప్‌ సీఎం అభ్యర్ధిని ప్రకటించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలు దేశంలో పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నాయి. ఈ క్రమంలో గోవా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పట్టుసాధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్ని‍స్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్‌ మాన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. గోవా ఆప్‌ సీఎం అభ్యర్థిగా లాయర్ అమిత్ పాలేకర్‌ పేరును ఆ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం పనాజిలో జరగిన మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఆప్‌ పోటీ చేస్తుందని వెల్లడించారు. గోవా ప్రజలు ఆప్‌కు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే గత ఎన్నికల్లో 40 స్థానాలకు గానూ 39 స్థానాల్లో పోటీ చేసిన ఆప్‌ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే ఈ సారి ఆప్‌ గోవాలో అధికారంలోకి వస్తే ఢిల్లీ మోడల్‌లో రాష్ట్రాన్ని అభిృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా 2017లో జరిగిన గోవా ఎన్నికల్లో ఎల్విస్‌ గొమెస్‌ నేతృత్వంలో ఆప్‌ బరిలోకి దిగింది. అయితే ఆయన వివిధ కారణాలతో 2020లో పార్టీని వీడాను. ఈ నేపథ్యంలో ఆప్‌ ఆద్మీ పార్టీ కొత్త సీఎం అభ్యర్థిని రంగంలోకి దింపింది.

* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన జీవో 317పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే తామిచ్చే తుది తీర్పునకు లోబడే కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలీతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
*గాంధీ ఆస్పత్రిలో 5వ అంతస్తు పై నుంచి పడి రోగి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. అయితే సదరు రోగి ఆత్మహత్య చేసుకున్నాడా? లేదంటే ప్రమాదవశాత్తు కింద పడిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి కావడంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరచారు.

*సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. పీవీ సునీల్ కుమార్‌పై వరకట్నం వేధింపుల కింద తెలంగాణలో కేసు నమోదు అయిందని లేఖలో తెలిపారు. భార్య పిర్యాదు మేరకు సునీల్‌పై తెలంగాణలో ఛార్జ్ షీట్ నమోదు చేశారని చెప్పారు. పీవీ సునీల్ కుమార్ ఈరోజు భార్య, తల్లిదండ్రులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారన్నారు. పార్లమెంట్ సభ్యుడి హోదాలో రాష్ట్రంలో శాంతిభద్రతల దృష్ట్యా … వరుస ఘటనలపై విచారణ జరిపి పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, వారిపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ లేఖ రాశారు. పీవీ సునిల్ తక్షణమే సీఐడీ చీఫ్ పోస్ట్ నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు లేఖలో పేర్కొన్నారు. 

*కరోనా వ్యాప్తి దృష్ట్యా అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయమై తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిషేధాన్ని ఫిబ్రవరి 28వరకు పొడిగిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక కరోనా కారణంగా2020 మార్చి 23నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

*టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. కవితతో పాటు కూచుకుల్లా దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ప్రొటెం చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రీ వీరిచే ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు కవిత, దామోదర్ రెడ్డిలకు మంత్రి మండలి రూల్స్ బుక్స్, ఐడి కార్డు అందజేశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

*ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, అజాంగఢ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ నిర్ణయించినట్టు వార్తలు ప్రచారంలోకి రావడంతో దానిపై ఆయన వివరణ ఇచ్చారు.”అజాంగడ్ ప్రజలు కోరితే ఎన్నికల్లో పోటీ చేస్తా” అని బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ప్రజల అనుమతి తీసుకుని అజాంగఢ్ నుంచి పోటీ చేస్తానని తెలిపారు.

*ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని గత ఏడాది అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. కాగా,2022 ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థిగా సిట్టింగ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అఖిలేష్, మాయావతి, ప్రియాంక గాంధీ వాద్రా పోటీ మాటేమిటని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అఖిలేష్ మనసు మార్చుకుని ఎన్నికల్లో పోటీకి నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అజాంగఢ్ ప్రజలు కోరితే పోటీ చేస్తానంటూ అఖిలేష్ తాజాగా ప్రకటించడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.*