Movies

రెబల్ స్టార్ జన్మదినం నేడే

రెబల్ స్టార్ జన్మదినం నేడే

శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 82వ జన్మదినం నేడు..?

తెలుగు సినిమా రెబల్ స్టార్, కథానాయకుడు, రాజకీయ నాయకుడు కృష్ణంరాజు జనవరి 20, 1940న జన్మించారు.

1970, 1980లలో 183 తెలుగు సినిమాలలో నటించారు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించారు. 12వ లోక్‌సభ ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు. ఆ తరువాత 13వ లోక్‌సభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు.

ప్రముఖ నటుడు, యువ రెబల్ స్టార్ ప్రభాస్ కృష్ణంరాజు తమ్ముడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడు.

కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం. విజయనగర సామ్రాజ్య వారసులు కృష్ణంరాజు. కృష్ణంరాజుకు జీవితబాగస్వామి శ్యామలా దేవి. 1996లో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. వీరికి ప్రసీద్ది, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తేలు.

కృష్ణంరాజు జీవన తరంగాలు (1973), కృష్ణవేణి (1974), భక్త కన్నప్ప (1976), అమరదీపం (1977), సతీ సావిత్రి (1978), కటకటాల రుద్రయ్య (1978), మన వూరి పాండవులు (1978), రంగూన్ రౌడీ (1979), శ్రీ వినాయక విజయము (1979), సీతా రాములు (1980), టాక్సీ డ్రైవర్ (1981), త్రిశూలం (1982), ధర్మాత్ముడు (1983), బొబ్బిలి బ్రహ్మన్న (1984), తాండ్ర పాపరాయుడు (1986), మరణ శాసనం (1987), విశ్వనాథ నాయకుడు (1987), అంతిమ తీర్పు (1988), బావ బావమరిది (1993), పల్నాటి పౌరుషం (1994) వంటి అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో నటించారు.

• రాష్ట్రపతి అవార్డులు
1977 అమర దీపం చిత్రానికి ఉత్తమ నటన
1978 మన వూరి పాండవులు చిత్రానికి ఉత్తమ నటన

• ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్
ఉత్తమ నటుడు – తెలుగు – అమరదీపం (1977)

• ప్రత్యేక జ్యూరీ అవార్డు –
ధర్మాత్ముడు (1983)
ఉత్తమ నటుడు – తెలుగు
బొబ్బిలి బ్రహ్మన్న (1984)
ఉత్తమ నటుడు – తెలుగు
తాండ్ర పాపారాయుడు (1986)

• ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (2006)

• నంది అవార్డులు
ఉత్తమ నటుడు
1977 అమర దీపం
1984 బొబ్బిలి బ్రహ్మన్న
ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్
1994 జైలర్ గారి అబ్బాయి

• 2014 – రఘుపతి వెంకయ్య అవార్డు

• TSR TV9 జాతీయ అవార్డులు
2012 – లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
2015 – వెండితెర లెజెండ్ యాక్టర్
2016 – 5 దశాబ్దాల స్టార్ అవార్డు

• జీ తెలుగు అవార్డ్స్
2015 – లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

• గల్ఫ్ ఆంధ్రా మ్యూజికల్ అవార్డ్స్ (GAMA)
2015 – లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు