DailyDoseMovies

పెనుగంచిప్రోలులో సందడి చేసిన ‘అఖండ’ బుల్స్ 

పెనుగంచిప్రోలులో సందడి చేసిన ‘అఖండ’ బుల్స్ 

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో ”అఖండ” ఎడ్లను చూడటానికి భారీగా జనం తరలివచ్చారు. పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల ఉత్సవంలో భాగంగా దేవతా మూర్తుల విగ్రహలను ఎడ్ల బండ్లపై ఉంచి జగయ్యపేటకు వేడుకగా తీసుకుపోతారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ”అఖండ” ఎడ్లను చూడటానికి భారీగా జనం తరలివచ్చారు. పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల ఉత్సవంలో భాగంగా దేవతా మూర్తుల విగ్రహలను ఎడ్ల బండ్లపై ఉంచి జగయ్యపేటకు వేడుకగా తీసుకుపోతారు. అందుకు ఎడ్ల బండ్లను లాటరీ పద్దతిలో ఎంపిక చేశారు. లాటరీలో మెుదటి బండిని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతల రామయ్య కైవసం చేసుకున్నారు. ఆ బండికి అఖండ సినిమాతో విశేష ప్రాచ్యుర్యం పొందిన ఎడ్లను కట్టాలని నిర్ణయించుకోని ఎడ్ల యాజమానిని ఒప్పించాడు. గురువారం గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామం నుంచి పెనుగంచిప్రోలుకు ఎడ్ల జతను తీసుకువచ్చారు. అఖండ సినిమాతో విశేష ప్రాచుర్యం పొందిన ఎడ్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల జనం భారీగా తరలి వచ్చారు. దూరంగా ఉండి ఎడ్లతో సెల్ఫీ దిగుతూ సందడి చేశారు.