NRI-NRT

TAMPA  దేవాలయంలో వాహన సేవల కు భారీ ఏర్పాట్లు

TAMPA  దేవాలయంలో వాహన సేవల కు భారీ ఏర్పాట్లు

టామ్ పా ఫ్లోరిడా హిందూ దేవాలయంలో ఫిబ్రవరి 9 నుండి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు కుంభాభిషేకం నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి డిప్యూటీ ఈవో ధర్మారెడ్డి ఈ ఉత్సవాలకు హాజరవుతున్నట్లు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గుత్తికొండ శ్రీనివాస్ తెలిపారు ఉత్సవాల సందర్భంగా నిర్వహించే వాహన సేవలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఏనుగు గుర్రం ఒంటె తదితర జంతువులను వాహన సేవలో ఉపయోగిస్తున్నట్లు తెలిపారు ఉత్సవాలు జరిగే సమయంలో హెలికాప్టర్ ద్వారా ఆకాశం నుండి ఆలయం చుట్టూ పుష్ప  జల్లులు పడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.