DailyDose

TNI తాజా వార్తలు – 21/01/2022

TNI తాజా వార్తలు – 21/01/2022

*సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని, మిగతా పంటలకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో దాదాపు 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏం చేశారు? అని రేవంత్‌ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోకపోతే.. రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

*టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కరోనా బారినపడ్డాడు. తనకు వైరస్ సోకిన విషయాన్ని భజ్జీ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తాను ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నానని, అవసరమైన అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు చెప్పాడు. తనలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయన్న హర్భజన్.. ఇటీవల తనను కలిసిన వారు వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరాడు.

*పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన సర్కారుపై ‘సమ్మె అస్త్రం’ ప్రయోగించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. వేర్వేరు సంఘాలన్నీ ఉమ్మడిగా కలిసి వచ్చి… ఉద్యమించాలని నిర్ణయించుకున్నాయి. పీఆర్సీపై ఎవరికి వారుగా కాకుండా… సంఘాలన్నీ ఉమ్మడిగా ఉద్యమించాలని పలు ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగసంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగుల నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు ఇవ్వనున్నాయి.

*గుడివాడలో టీడీపీ నేతలపై దాడిని ఖండిస్తున్నామని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అక్రమ సంపాదన గుట్టు బయట పడడంతోనే కేసీనో మంత్రి అసహనంతో బూతులు మాట్లాడుతున్నారని దేవినేని విమర్శించారు. బూతుల మంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేసి..అరెస్ట్‌ చేయాలని ట్విటర్‌లో దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

*దాదాపు 20 వేల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం ఓ ప్రభుత్వ సర్వర్ నుంచి అక్రమంగా బయటకు పొక్కింది. వ్యక్తుల పేర్లు, చిరునామాలు, మొబైల్ ఫోన్ నంబర్లు, కోవిడ్ పరీక్షల ఫలితాలు బయటకొచ్చాయి. ఆన్‌లైన్ సెర్చ్ చేసి ఈ వివరాలను చూసేందుకు వీలుగా ఉన్నాయి. Raid Forums వెబ్‌సైట్‌లో ఈ సమాచారాన్ని అమ్మకానికి పెట్టినట్లు జాతీయ మీడియా శుక్రవారం తెలిపింది.

*దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) స్వాగతించింది. గణతంత్ర దినోత్సవాల కవాతు కోసం నేతాజీపై రూపొందించిన పశ్చిమ బెంగాల్ శకటం తిరస్కరణకు గురైన నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయని, వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించింది. నేతాజీ అదృశ్యం వెనుక మిస్టరీని ఛేదించేందుకు తగిన చర్యలు తీసుకుని ఉంటే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అయ్యేదని పేర్కొంది.

*ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం అటు ప్రభుత్వం ఇటు సినీ నిర్మాతల మధ్య అగాధాన్ని పెంచింది. నినీ నిర్మాతలతో పాటు దర్శకుడు రాంగోపాల్ వర్మతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవిని సీఎం జగన్ తాడేపల్లికి పిలిపించుకున్నారు. చిరంజీవి, జగన్ భేటీతో టికెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని అందరూ అనుకున్నారు. జగన్‌తో సమావేశం తర్వాత చిరంజీవి కూడా అందరికీ శుభవార్త తెలిపారు. సినీ రంగ సమస్యలపై జగన్ సానుకూల రీతిలో స్పందించారని, త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని చిరంజీవి తెలిపారు. సినీ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ సీఎంకు సమగ్రంగా వివరించానని చెప్పారు. జగన్‌ ఇచ్చిన భరోసాతో ధైర్యం వచ్చిందన్నారు. సినీ పరిశ్రమవారు ఎవరూ అభద్రతా భావానికి లోనుకావద్దని, సంయమనంతో వ్యవహరించాలని, విమర్శలు చేయవద్దని కోరారు.

*ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై పరువునష్టం దావా వేయనున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ బుధవారంనాడు చెప్పారు. తనను ”నిజాయితీ లేని వ్యక్తి”గా సంబోధిస్తూ ట్విట్టర్ హ్యాండిల్‌లో కేజ్రీవాల్ ఒక పోస్ట్ చేసినట్టు చన్నీ తెలిపారు. ఆయనపై పరువునష్టం కేసు వేసేందుకు అనుమతించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని కోరినట్టు చెప్పారు. కేజ్రీవాల్ అన్ని హద్దులూ అతిక్రమించారని, ఇతరుల ప్రతిష్టను భంగపరచేలా ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. గతంలో కూడా ఇలాంటి పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు ఆయన చేశారని, వాటిపై నితిన్ గడ్కరి, దివంగత అరుణ్ జైట్లీ, సాద్ నేత బిక్రం సింగ్ మజితాయ్‌కి కేజ్రీవాల్ క్షమాపణలు కూడా చెప్పారని గుర్తు చేశారు.

*కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంపై తమిళనాడు ప్రభుత్తం అప్రమత్తమైంది. ఈనెల 23వ తేదీ ఆదివారంనాడు రాష్ట్రవ్యాప్తంగా పూర్తి లౌక్‌డౌన్‌ను ప్రకటించింది. పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారంనాడు ప్రకటించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, విమానాశ్రయాలకు, బస్, రైల్వేస్టేషన్లకు ప్రయాణికులను తీసుకువెళ్లే ఆటోలు, టాక్సీలను మాత్రం అనుమతిస్తారు. తమిళనాడులో గురువారం ఒక్కరోజు 28,561 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 30,43,796కు చేరింది.

*ఖైరతాబాద్ సర్కిల్ హిల్ టాప్ కాలనీలో జరుగుతున్న ఇంటింటి ఆరోగ్య సర్వే ను ఆకస్మికంగా తనికీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. పాల్గొన్న జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ సీ.ఎస్. సోమేశ్ కుమార్ష్ట్ర ఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటిoటికీ ఆరోగ్యం పేరుతో ఇంటింటి ఫీవర్ సర్వే నేడు ప్రారంభమైంది. ఒక్కొక్క టీమ్ లో ఆశా/ ఏ.ఎన్.ఎం/ మున్సిపల్/ పంచాయితీ శాఖ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి ఎవరైనా జ్వరం, దగ్గు తదితర ఇబ్బ దులతో ఉన్నారా పరిశీలించి, ఒకవేళ కవిడ్ లక్షణాలుంటే మెడికల్ కిట్ ను అందచేస్తారు.

*సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు. వైశ్యులను కించపరిచే విధంగా ఉన్న చింతామణి నాటక ప్రదర్శనను నిషేదించాలన్న ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఇటీవల నిషేదించిన ఏపీ ప్రభుత్వం. సీఎంని కలిసిన వారిలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్, ఆర్యవైశ్య వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్, ఆర్టీఐ కమిషనర్‌ రేపాల శ్రీనివాసరావు.

*ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై చర్చ. పీఆర్సీ జీవోలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం. పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంపునకు ఆమోదం. కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలపై ఆమోదం. ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదం. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయింపు. ఉద్యోగులకు 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపు. ఈబీసీ నేస్తం అమలుకు మంత్రివర్గం ఆమోదం. వారానికి 4 సర్వీసులు నడిపేలా ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందానికి ఆమోదం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు అమలులో ఒప్పందం. ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా మంత్రివర్గం ఆమోదం.

*గుడివాడ లో టిడిపి కార్యాలయంపై వైసిపి గూండాల దాడి, సీనియర్ నేత బోండా ఉమా గారి కారుని ధ్వంసం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసిపి గూండాలు రెచ్చిపోతున్నా ప్రేక్షకపాత్ర పోషించడం, పార్టీ కార్యాలయంలోకి పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే గడ్డం గ్యాంగ్ క్యాసినో నడిచిందనేది స్పష్టమవుతోంది….నారా లోకేష్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.

*కోవిడ్ వచ్చి ప్రైవేటు రంగంలో చాలామందికి ఉద్యోగాలు పోయాయి. ఒకవేళ ఉద్యోగాలు నిలబడ్డా చాలా వరకు జీతం కోతకు గురైంది. ఇక చిన్న దుకాణాలు, చిన్నా, చితకా పనులు చేసుకుంటూ బ్రతుకు బండి ఈడుస్తున్న లక్షలాది మంది అలా బ్రతికేస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగికీ జీతం తగ్గలేదు. పని తగ్గిందేమో కానీ జీత భత్యాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు కాస్త పెరిగాయి. ఇంకా పెరగాలంటా…మామూలు గానే ప్రభుత్వ ఉద్యోగులు అంటే జనానికి పడదు.అలాంటిది కరోనా విపత్కర పరిస్థితుల్లో జీతాలు పెంచాలంటూ ఉద్యమాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను చూసి జనం ఛీత్కరించుకొంటుంన్నారు. వాళ్ళ ఆందోళనలకు మద్దతు ఇచ్చేవారు ఇది గమనిస్తే మంచిది.

* ఖైరతాబాద్ సర్కిల్ హిల్ టాప్ కాలనీలో జరుగుతున్న ఇంటింటి ఆరోగ్య సర్వే ను ఆకస్మికంగా తనికీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. పాల్గొన్న జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ .

*సీ.ఎస్. సోమేశ్ కుమార్… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటిoటికీ ఆరోగ్యం పేరుతో ఇంటింటి ఫీవర్ సర్వే నేడు ప్రారంభమైంది. ఒక్కొక్క టీమ్ లో ఆశా/ ఏ.ఎన్.ఎం/ మున్సిపల్/ పంచాయితీ శాఖ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి ఎవరైనా జ్వరం, దగ్గు తదితర ఇబ్బ దులతో ఉన్నారా పరిశీలించి, ఒకవేళ కవిడ్ లక్షణాలుంటే మెడికల్ కిట్ ను అందచేస్తారు.