Food

‘చేప’ పరదాలు

‘చేప’ పరదాలు

‘ చేపా చేపా ఎందుకు ఎండలేదూ అంటే … గడ్డిమోపు అడ్డమొచ్చిందీ … ‘ వంటి కథలు అక్కడ వినిపించవు ఎండేలా ఎండబెడితే ఎలాంటి చేపయినా ఎండి తీరాల్సిందే అంటారు కోలి తెగ వాసులు . ముంబైలో వాళ్లు నివసించే కోలి వాడలకు- ముఖ్యంగా వెర్సోవా బీచ్ వైపు వెళితే … అంతస్తులవారీగా కట్టిన వెదురు గుంజలూ వాటికి పరదాల్లా వేలాడుతున్న చేపలూ కనిపిస్తాయి . కోలి ప్రజలు ఓర్పుగా నేర్పుగా కర్రలకి చేపల్ని కట్టే పద్ధతే ఎంతో చిత్రంగా ఉంటుంది . ఒక చేప నోట్లో మరో చేప తలని దూర్చి , కర్రకి అటొకటీ ఇటొకటీ వచ్చేలా వేలాడదీస్తుంటారు . ఆ చేపలు మూడునాలుగురోజుల్లో ఆసాంతం ఎండి , ఎంతకాలమై నిల్వ ఉంటాయి . చేపల్ని పట్టడం , వాటిని అమ్మడమే ప్రధాన వృత్తిగా చేసుకున్న కోలి తెగ ప్రజలకు చేపలన్నా చేపలతో చేసే రకరకాల వంటకాలన్నా మహా ఇష్టం . అందులోనూ ఈల్ చేపల మాదిరిగా ఉండే బాంబే డక్ లేదా బాంబిల్ చేపలంటే మరీనట . అందుకే వేసవిలో పట్టిన ఈ రకం చేపల్ని జాగ్రతగా ఎండబెటి నిల్వ చేసుకుంటారు. చేప రుచి లేందే వారికి ముద్ద దిగదు.