Movies

ప్రయాణంలో ఈ పోరాటం ఓ భాగమే!

Auto Draft

నటి హంసానందిని క్యాన్సర్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఆమె స్వయంగా ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం ఆమెకు కీమో థెరపీ చికిత్స జరుగుతోంది. ఒకవైపు చికిత్స తీసుకుంటూనే.. మరోవైపు త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను అని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. గుండుతోనే ఫొటో షూట్స్‌లో పాల్గొంటోంది. తాజాగా మనీష్‌ మల్హోత్రా షూట్‌లో గుండుతో ఉన్న హంసానందిని ఫొటోని ఆమె స్టయిలిష్ట్‌ అమీ పటేల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.ఫొటోతో పాటు.. ‘‘హంసానందినీ మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. బలం.. నమ్మకం.. ఇవి మీ అందాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఈ ప్రయాణంలో క్యాన్సర్‌తో మీరు చేస్తున్న పోరాటం ఓ భాగం మాత్రమే. దీని నుంచి మీరు త్వరలోనే ఇంకా ఎంతో అందంగా తిరిగివస్తారు. మీ వెంటే మేమంతా ఉన్నాం’’ అని అమీ పటేల్‌ పేర్కొన్నారు.