Politics

నేటి రాజకీయ వార్తలు – 22/01/2022

నేటి రాజకీయ వార్తలు – 22/01/2022

*నిద్రపోయిన సింహాన్ని తట్టిలేపావు: కొండా సురేఖ
ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లో కొండా మురళీ తల్లిదండ్రుల స్మారక స్థూపం ధ్వంసంపై మాజీ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్రపోయిన సింహాన్ని తట్టిలేపావు, ఖబడ్దార్ చల్లా ధర్మారెడ్డి అంటూ హెచ్చరించారు. కాచుకో చల్లా ధర్మారెడ్డి నీ భరతం పడతామని సురేఖ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌లు కూడా ఏం చేయలేరని ఆమె అన్నారు. నీ పాపాలు పండేరోజు దగ్గర పడిందని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ తల్లిదండ్రుల స్మారక స్థూపాన్ని ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతో ధ్వంసం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సొంత స్థలంలో నిర్మించుకున్న స్థూపాన్ని ఎలా ధ్వంసం చేస్తారని కొండా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* ప్రభుత్వాన్ని దింపి తీరుతాం : పరిపూర్ణానంద
 సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని యత్నించారన్నారు. కేరళ కూర్గ్‌లో కొండ జాతి గిరిజనులను టిప్పు సుల్తాన్ ఉచకోత కోశారని పరిపూర్ణానంద తెలిపారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టాలనుకున్న జగన్ ఆలోచన ఎలాంటిదో అర్థమవుతుందన్నారు. పీఎఫ్ఐ ప్రోత్సహంతో హిందువులు 98 శాతం ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మించే ప్రయత్నం చేశారన్నారు. తుగ్లక్ సుల్తాన్, తుగ్లక్ బాద్‌షాలు తయారవుతున్నారని… ప్రభుత్వాన్ని దింపి తీరుతామన్నారు. జగన్‌కు జైళ్లలో వేయడం ఆనవాయితీగా మారిందన్నారు. జైల్ భరో చేసి జైళ్లను నింపుదామన్నారు. హిందువులు అందరినీ కేసులు పెట్టి లోపల వేసినా సిద్ధంగా ఉండాలని పరిపూర్ణానంద పిలుపునిచ్చారు.

*డివాడలో కేసినో నడిపినా పోలీస్ వ్యవస్థ ఏమి చేయలేకపోయింది: సీఎం రమేష్ఆ
త్మకూరు ఘటనపై ప్రభుత్వం స్పందన లేదని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. శ్రీకాంత్ రెడ్డిని హత్య చేయడానికి వచ్చిన వారిని వదిలి ఆయన పైనే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. గుడివాడలో కేసినో నడిపినా పోలీస్ వ్యవస్థ ఏమి చేయలేకపోయిందన్నారు. జగన్‌కి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలన్నారు. దేశంలో ఎక్కడ ప్రభుత్వ వేతనాలు తగ్గించిన సందర్భాలు లేవన్నారు. ఏపీలో ఏమి చేసినా చెల్లుతుందని ప్రభుత్వం భావిస్తోందని సీఎం రమేష్ పేర్కొన్నారు.

*జగన్‌ది మోసపూరిత పాలన: కిమిడి 
జగన్‌రెడ్డి మోసపూరిత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదని టీడీపీ యువనాయకుడు కిమిడి నాగార్జున విమర్శించారు.. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ   ముఖ్యమంత్రి కాక ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 27ు ఫిట్‌మెంట్‌ ఇస్తానని నమ్మబలికి, 23ు ఇవ్వడం అన్యాయమన్నారు  ‘9నెలల పాటు ఇచ్చిన మధ్యంతర భృతిని ప్రభుత్వం వెనక్కి లాగేసుకోవడం దారుణం. 5డీఏలు ఇవ్వడం లేదు. ఇచ్చింది లాక్కుకున్నారు. గతంలో హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు 12,14,20,30ు ఉండేవి. ఇప్పుడు డీఏల ప్రకారం విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పలాస ప్రాంతాల్లో పని చేసే వారికి 8ు హెచ్‌ఆర్‌ఏ తగ్గించిట్లైంది. ఉద్యోగులకు న్యాయంగా రావాల్సినవి ఇవ్వకుండా ఆర్ధిక ప్రయోజనాలను ఇవ్వకపోతే, ఉద్యోగులు ఏమైపోవాల’ని ప్రశ్నించారు. మధ్యంతర భృతి కన్నా తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చిన చరిత్ర జగన్‌కే ఉందని, దీన్ని బట్టి జగన్‌ పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు.  

*పీఆర్సీపై చర్చించడానికి సజ్జల ఎవరు?: హర్షకుమార్‌
పీఆర్సీ కోసం పోరాడుతున్న ఉద్యోగ సంఘాల నేతలను జగన్‌ ప్రభుత్వం తమ స్వార్థం కోసం జోకర్లుగా మార్చేసిందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయబద్ధంగా చేయాల్సిన పీఆర్సీ, ఫిట్‌మెంట్‌, ఇంటి అద్దె భత్యం తదితర సమస్యలపై కప్పదాటు వైఖరి ప్రదర్శించిన ప్రభుత్వం.. అర్ధరాత్రి జీవోలను ప్రవేశపెట్టి వారికి అన్యాయం చేసిందన్నారు. అసలు పీఆర్సీపై ఉద్యోగ నేతలతో చర్చిండానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం ద్రోహం చేస్తోందన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా వారి అవసరాలు, ప్రయోజనాల కోసం కాకుండా సమష్టిగా సమస్యలపై ఉద్యమించాలని, అయితే సమ్మెకు వెళ్లడం సరికాదని చెప్పారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి పరిధిలో జరిగిన గెడ్డం శ్రీను హత్య కేసు విషయంలో బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వ చేసిందేమిలేదన్నారు. న్యాయస్థానం జోక్యంతో ఈరోజు ఈ కేసు హత్యకేసుగా నమోదైందని ఆయన చెప్పారు.

*తప్పడం జగన్‌ దినచర్య: తులసిరెడ్డి 
మాట తప్పడం.. మడమ తిప్పడం ముఖ్యమంత్రి జగన్‌ దినచర్యగా మారిందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాతోపాటు.. అమరావతి రాజధాని, పోలవరం, ఇసుక పాలసీ, మద్యం పాలసీ, శాసన మండలి రద్దు, రైతు భరోసా, అగ్రిగోల్డ్‌, పెళ్లికానుక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. తాజాగా ఉద్యోగులు, నిరుద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తాం, పీఆర్సీని సకాలంలో అమలు చేస్తాం, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమానపనికి సమాన వేతనం అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని పేర్కొన్నారు. అందుకే ఉద్యోగులు, నిరుద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఆందోళనబాట పట్టారని, వీరికి కాంగ్రెస్‌ పార్టీ సంఘీభావం తెలియజేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ జీవోలను, 62ఏళ్ల వయోపరిమితి నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని,  ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు.