2021 అక్టోబర్ లో లండన్ వేదికగా తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ-దసరా వేడుకల్లో UK National Health Services (NHS UK) కోవిడ్ వారియర్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ లండన్ టవర్ బ్రిడ్జి ఆకృతిని ఏర్పాటు చేశారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం-ప్రభలత దంపతుల కుమార్తె నిత్యశ్రీ కూర్మాచలం ఈ వేడుకల నివేదికను బ్రిటన్ మహారాణికి ఒక లేఖ రూపేణా రాసింది. ఈ లేఖకు బ్రిటన్ మహారాణి ప్రత్యుత్తరం రాసినట్లు టాక్ అధ్యక్షుడు కడుదుల రత్నాకర్ తెలిపారు. మహారాణి బతుకమ్మ వేడుకల ఫోటోలను చూసి సంతోషం వ్యక్తం చేశారని, UK NHS సేవలను ఉత్సవాల ద్వారా కొనియాడిన తీరును మహారాణి ప్రశంసించారని, టాక్ సంస్థ కృషితో పాటు, నిత్యశ్రీని కూడా అభినందించారని ఆయన తెలిపారు.
TAUKకు బ్రిటన్ మహారాణి ప్రశంసలు
