Politics

టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్

టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్

టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఎం, కొడాలి నాని, డీజీపీపై వ్యతిరేకంగా బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుద్దా వెంకన్నను ఆయన నివాసానికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. వివరణ అడిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కూడా మండిపడ్డారు.