Health

అవిసె గింజల ఆరోగ్య ప్రయోజనాలు

అవిసె గింజల ఆరోగ్య ప్రయోజనాలు

ముఖ్యమైన పోషకాల “చిరు కాణాచి” అవిసె గింజ. అంటే మానవ ఆరోగ్యానికి లాభదాయకమైన పోషకాలను కల్గి ఉండే గొప్ప మూలం అవిసె గింజ. ఏ ఇతర తృణధాన్యాల్లోనూ లేనంతటి ఎక్కువ పరిమాణంలో “ఒమేగా 3” కొవ్వు ఆమ్లాలను అవిసె గింజ కల్గి ఉంది. కొవ్వు ఆమ్లాలను అధికంగా ఉండే చేపలు తదితరాది సముద్ర ఆహారానికి ప్రత్యామ్నాయం అవిసె గింజ. మానవ శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలను అవిసె గింజ పుష్కలంగా కల్గి ఉంది.

**ఇపుడు అవిసె గింజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం:
అవిసె గింజలోని ఈ ఫైబర్ (పీచుపదార్థం) లోని అధిక భాగం జీర్ణంకాని పీచుపదార్థం. ఈ జీర్ణము కాని పీచుపదార్ధం ఆహారంతో కలిసి పేగుల్ని నిండేలా చేస్తుంది, తద్వారా బరువు తగ్గుదలకు సహాయం చేస్తుందిఅవిసె గింజలలో ‘ఒమేగా-3’ కొవ్వు ఆమ్లాలను అధికం గా ఉంటాయి.  కాబట్టి వీటిని తింటే శరీరం యొక్క ఆరోగ్యకరమైన పనితీరుకు చాలా ఉపయోగపడుతుంది.
అవిసెలోని ఈ పీచుపదార్థాలు రక్తంలోని కొవ్వులతో సులభంగా కలిసిపోయి మనం తాగే నీటిలో ఆ కొవ్వులు కలిసేలా చేస్తాయి.తద్వారా శరీర వ్యవస్థ నుండి చెడ్డకొవ్వులని బయటకు పంపివేస్తాయి, అని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

బోస్టన్ (USA) లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం, అవిసెగింజల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండడం వలన అవి గుండెపోటు మరియు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని  సూచించింది.
అవిసెలోని కొవ్వు ఆమ్లాలు  శరీరంలో ఏర్పడే కాన్సర్ కణాల్నిఅపోప్టోసిస్ (apoptosis) ద్వారా చంపేస్తామని, తద్వారా కాన్సర్కుండే తీవ్రతను  తగ్గిస్తాయని ఒక అధ్యయనం పేర్కొంది.
అనామ్ల పదార్థాలు (antioxidants) పుష్కలంగా ఉన్న అవిసెగింజలు దద్దురు లేక రాషెస్, మొటిమలు, ఇతర చర్మవ్యాధుల వంటి చర్మానికి సంబంధించిన సమస్యల పై విరుద్ధంగా పోరాడడంలో సాయపడతాయి.అవిసెగింజల్ని ఆహారంగా (orally) తీసుకోవడం లేదా అవిసెగింజల జెల్ ను  జుట్టుకు రాయడం ద్వారా పొడవైన మరియు మెరిసే జుట్టును స్వంతం చేసుకోవచ్చు.
అవిసె గింజలలో ఎన్నో రకాల పోషక పదార్దాలు ఉన్నాయి అవి శరీర సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి.  బరువు కోల్పోయేందుకు, మలబద్ధకానికి అవిసె గింజలు

అవిసె గింజలను మీ ఆహారంతో పాటు తీసుకుంటే అధిక బరువును కోల్పోవడంలో మీకు సహాయపడుతుందని ప్రత్యేకమైన పరిశోధన పేర్కొంది. అవిసె గింజలు 35% ఆహారపు ఫైబర్ కలిగి ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అవిసె గింజలోని ఈ ఫైబర్ (పీచుపదార్థం) యొక్క సింహపాలు జీర్ణంకాని పీచుపదార్థం. ఈ జీర్ణము కాని పీచుపదార్ధం  ప్రధానమైన ఆహారానికి తోడై మీ పేగుల్ని నింపుతుంది, ఇది కరగని పీచు ఆహారం (dietary fiber) కావడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియలో ప్రధాన ఆహారంలో కలిసిపోయి నెమ్మదిగా పేగు ద్వారా వెళుతుంది. దాని ఫలితంగా, మీరు ఎక్కువ సమయం ఆకలి లేకుండా కడుపు నిండిన అనుభూతిని చెందుతారు. ఇక్కడ మరో ఉత్తమ అంశం ఏమంటే ఆహారంలోని పీచుపదార్థం అందులోని పోషకాంశాలకు ఎలాంటి అవరోధం కల్గించదు. పైగా, భోజనాల మధ్య ఉండే కాలం అంతరాన్ని పెంచుతుంది. మీరు బరువు కోల్పోవాలనుకుంటే అవిసె గింజల ఆహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దానికితోడు, ఆహారంలో గనుక అవిసె గింజల్లాంటి ఫైబర్ (పీచు) పదార్థం ఉంటే మలబద్ధకం ఏర్పడకుండా నివారించి మీ ఆరోగ్యం బావుండేట్లు సహాయపడుతుంది. కానీ మీరు జీర్ణక్రియకు తగినంతగా నీటిని తాగాలి. మరీ ముఖ్యంగా అవిసె గింజలతో కూడిన ఆహారం తీసుకున్నపుడు అది పీచు కారణంగా ప్రేగుల్లోనే చిక్కుకుపోకుండా ఉండేందుకు నీళ్లు బాగా తాగాలి. అదనంగా, అవిసెపై నిర్వహించిన తదుపరి అధ్యయనాలు చెప్పేదేమంటే అవిసె గింజల పానీయాలు, అవిసె గింజల బ్రెడ్ లేదా రొట్టెల్ని ఆహారంగా పుచ్చుకుంటే అవిసెలోని కరుగుడు స్వభావమున్న పీచుపదార్థాల కారణంగా  రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గిపోతుంది

*అవిసె గింజలు ముఖ్యమైన పోషకాలకు నిలయం
మొక్కల రాజ్యంలో, అవిసె గింజల్లో శరీరానికి ముఖ్యంగా కావాల్సిన “ఒమేగా -3” కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఒమేగా -3” కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే సస్యాలతో అవిసె ఒకటి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి అత్యవసరమైన కొవ్వు ఆమ్లాల సమూహం. ఈ ఆమ్లాలని శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు. కాబట్టి, మన శరీరం ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలని బాహ్య వనరుల  నుండి తప్పనిసరిగా పొందాలి. అవిసె గింజలు ఈ ‘ఒమేగా-3’ కొవ్వు ఆమ్లాలను దండిగా కల్గిన ఆహార పదార్ధంగాబట్టి వీటిని తింటే శరీరం యొక్క ఆరోగ్యకరమైన పనితీరుకు చాలా ఉపయోగపడుతుంది.