DailyDose

నేటి తాజా వార్తలు – 25/01/2022

నేటి తాజా వార్తలు – 25/01/2022

*ఇంటర్ ప్రైవేట్ అభ్యర్థులు తత్కాల్ పథకం కింద ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్బోర్డు కార్యదర్శి ఎస్.వి.శేషగిరిబాబు సోమవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. తత్కాల్ కింద రూ.1300, అటెండెన్స్ మినహాయింపు ఫీజు రూ.1300, మొదటి ఏడాది పరీక్ష ఫీజు రూ.500, రెండో ఏడాది పరీక్ష ఫీజు రూ.500లు ఉంటుందన్నారు. ఫీజులకు సంబంధించిన చలానాలను ఫిబ్రవరి 2లోపు ఆన్లైన్లో తీయాలని, నాలుగో తేదీలోగా ఆర్ఐవో కార్యాలయాల్లో సమర్పించాలని పేర్కొన్నారు.

*ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు రాతపరీక్ష మే 14, 15తేదీల్లో జరుగుతుందని ఏపీపీఎస్సీ సోమవారం పేర్కొంది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్టికెట్లు వెబ్సైట్లో పెడతామని తెలిపింది.

*ఏపీ పీసెట్ రాసి అర్హత సాధించిన అభ్యర్థులు బ్యాచ్లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 27, 28 తేదీల్లో రిజిస్ర్టేషన్లు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఏపీఎ్సహెచ్ఈ.గవ్.ఇన్ వెబ్సైట్లో పూర్తి వివరాలను పొందుపరిచామని పీసెట్ కన్వీనర్ టి.లక్ష్మమ్మ సోమవారం నాడు తెలిపారు.

*ఏపీ ఉద్యోగుల ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా విజయవాడలో ఉపాధ్యాయ, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. పాతబస్టాండ్ నుంచి ధర్నా చౌక్ వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. 11వ పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలని, పీఆర్సీ కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై ఉద్యమంలో వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు.

*బీజేపీ బృందం గుడివాడకు బయల్దేరింది. ఈ బృందంలో సోమువీర్రాజు, సీఎం రమేష్, మాధవ్, నారాయణరెడ్డి తదితర నేతలు ఉన్నారు. సంక్రాంతి సంబరాల ముగింపుకు గుడివాడ వెళ్తున్నామమని నేతలు తెలిపారు. కాగా ముగింపు ఉత్సవాలకు అనుమతి లేదంటూ.. కళ్యాణ మండపాన్ని పోలీసులు తిరస్కరించారు. గుడివాడ కేసినో ఘటనపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు.

*ఏపీకి 16 పోలీస్ గ్యాలెంట్రీ మెడల్స్ లభించాయి. రిపబ్లిక్ డే పురస్కరించుకొని పోలీస్ మెడల్స్ను కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనాకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్(పీపీఎం) వచ్చింది. పోలీస్ శాఖలో తన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర హోం శాఖ మెడల్ ప్రకటించింది. ఏపీలో మొత్తం 15 మందికి పోలీస్ మెడల్స్(పీఎం) లభించాయి. మెరిటోరియస్ సేవలను గుర్తిస్తూ పీఎం పతకాలకు ఎంపిక చేశారు.

*సంక్రాంతి పండుగ తరువాత రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు బయడపడుతున్నాయి. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 13,819 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 12 మంది మరణించారు. ఏపీలో మొత్తం 22,08,955 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 14,561 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 1,01,396 యాక్టివ్ కేసులు ఉన్నాయి, 20,92,998 మంది కరోనా నుంచి రికవరీ చెందారు.

*టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. గతంలో ఏసీటీవోగా పని చేసిన సమయంలో అశోక్బాబు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. తన సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదైంది. బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే అభియోగంపై కేసు నమోదు చేశారు.

* రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీహెచ్ శ్రీనివాసరావురాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం: డీహెచ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించే పరిస్థితులు లేవు: డీహెచ్పాజిటివిటీ 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు అవసరం: డీహెచ్ గత వారంలో ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 10శాతం లేదు: డీహెచ్మెదక్ లో అత్యధికంగా 6.45, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14 శాతం పాజిటివిటీ: డీహెచ్ జీహెచ్ ఎంసీలో 4.26, మేడ్చల్ లో 4.22 శాతం పాజిటివిటీ: డీహెచ్ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1శాతం: డీహెచ్ముందు జాగ్రత్తగా జనం గుమిగూడకుండా ఈనెల 31 వరకు ఆంక్షలు పొడిగింపు: డీహెచ్వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు: డీహెచ్రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోంది: డీహెచ్ మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ: డీహెచ్
18 ఏళ్ల లోపు వారికి 59 శాతం వ్యాక్సినేషన్: డీహెచ్ 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు: డీహెచ్ప్రభుత్వం తప్పుడు గణాంకాలు సమర్పిస్తోందని పిటిషనర్ల న్యాయవాదుల వాదనమూడు రోజుల్లో 1.70 లక్షల జ్వర బాధితులను పరిస్థితి తీవ్రతకు నిదర్శనమన్న న్యాయవాదులుప్రభుత్వ కిట్ లో పిల్లల చికిత్సకు అవసరమైన మందులు లేవన్న న్యాయవాదులుప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోదన్న ఏజీ ప్రసాద్
మాస్కులు, భౌతిక దూరం కూడా అమలు కాకపోవడం దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యకోవిడ్ నిబంధనలను జీహెచ్ ఎంసీ, పోలీసులు కఠినంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశంపరిస్థితి వివరించేందుకు డీహెచ్ శ్రీనివాసరావు తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశం కరోనా కేసులపై విచారణ ఈ నెల 28కి వాయిదా.

*మహారాష్ట్ర వార్థా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి కారు కిందపడిన ఘటనలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.

*నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కి రైతుల సెగ ఇసపల్లి గ్రామంలో అర్వింద్ ధర్మపురి కి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టిన పసుపు రైతులు పసుపు బోర్డ్ ఎక్కడ? అని ప్లకార్డులతో కాన్వాయ్ ని అడ్డుకున్న రైతులుమరోసారి రైతుల మీదికి తన కారుని తీసుకెళ్లడానికి ప్రయత్నించిన ఎంపీ అర్వింద్ రైతులకు తృటిలో తప్పిన ప్రమాదం రైతుల ఆగ్రహంతో వెనుదిరిగి పారిపోయిన ఎంపీ… జిల్లా లో తిరగనియం అని హెచ్చరించిన రైతు సంఘ నాయకులు…. రైతుల కోపానికి భయపడి తన కార్యక్రమాలు రద్దు చేసుకోని పారిపోయిన ఎంపీ అర్వింద్.

*నాగార్జునసాగర్ ప్రాజెక్టు సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ ధర్మ నాయక్ పై హత్యాయత్నం కేసు.. కానిస్టేబుల్ తో పాటు మరో ఆరు మందిపై కూడా నమోదు ఆస్తి కోసం ఈ నెల 4న భార్య కు బలవంతంగా యాసిడ్ తాగిన వైనం
దర్యాప్తు చేస్తున్న సైదాబాద్ పోలీసులు

*కేసీఆర్ గారు సిగ్గుతో తలదించుకోవాలి: వైయస్ షర్మిల
ఇంటికో ఉద్యోగం వస్తుందని విద్యార్థులను మోసం చేశారు. డిగ్రీలు చదివిన వారిని హమాలీ పని చేసుకునేలా చేశారు. ఐదు, పదో తరగతి కూడా చదవని వారిని మంత్రులను చేశారు.

*తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని విద్యార్థులను మోసం చేసినందుకు, ఏడేళ్ల పాలనలో నోటిఫికేషన్స్ ఇవ్వనందుకు, డిగ్రీలు చదివిన వాళ్లను హమాలీ పని చేసుకునేలా, పీజీలు చదివిన వాళ్లను రోడ్ల మీద ఛాయ్ అమ్ముకునేలా చేసి… ఐదు, పదో తరగతి కూడా చదవని వాళ్లను మంత్రులు చేసినందుకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నందుకు, నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోనందుకు కేసీఆర్ గారు సిగ్గుపడాలని అన్నారు. అవమానంతో తలదించుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దని చెప్పారు.*
*మరోవైపు ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆమె స్పందిస్తూ… ఓటుతోనే మార్పు సాధ్యమని చెప్పారు. మెరుగైన సమాజ నిర్మాణానికి ఓటే వజ్రాయుధమని అన్నారు. అవినీతి, అక్రమాలు అంతం కావాలన్నా.. నియంత, నిరంకుశ పాలన పోవాలన్నా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా ఉపయోగించుకోవాలని చెప్పారు. అందరం నిస్వార్థంగా ఓటు వేద్దామని… మన బతుకులు మార్చుకుందామని కోరారు.*

*జడ్జిలను దూషించిన కేసుపై హైకోర్టులో విచారణ..!సోషల్ మీడియాలో పోస్టింగ్ లు తొలగించాలని హైకోర్టు ఆదేశాలు.సోషల్ మీడియాలో జడ్జిలను దూషించిన కేసులో సీబీఐ దర్యాప్తుపై విచారణ.సోషల్ మీడియాలో పోస్టులు తొలగించాలని లేఖ రాశామన్న సీబీఐ న్యాయవాది.లేఖ రాసినా ట్విటర్, ఫేస్ బుక్, యూట్యూబ్ పట్టించుకోవట్లేదన్న సీబీఐ న్యాయవాది.హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేఖకూ స్పందించకపోవడంపై అభ్యంతరం.సీబీఐ లేఖ రాస్తే కోర్టు ఉత్తర్వులుగానే పరిగణించాలన్న హైకోర్టు.కోర్టు ఉత్తర్వులుగా పరిగణించాలని ట్విటర్, ఫేస్ బుక్, యూట్యూబ్ కు ఆదేశాలు.ఇకపై ఆదేశాలు పాటించాలని హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు.సోషల్ మీడియా తరఫున హాజరైన న్యాయవాదులకు హైకోర్టు ప్రశ్న. సీబీఐ, రిజిస్ట్రార్ జనరల్ లేఖలకు ఎందుకు స్పందించట్లేదని హైకోర్టు ప్రశ్న.

*హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 66లో ఫుట్పాత్ను ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటికి జీహెచ్ఎంసీ అధికారులు ఈరోజు మరోసారి వెళ్లారు. కొన్ని రోజుల క్రితమే సీఎం రమేశ్కు చెందిన ప్రహారీ గోడను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చి వేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే, ఆ ప్రహారీ గోడ కూల్చిన చోటే మరో ప్రహారీగోడను నిర్మించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. దాన్ని మళ్లీ కూల్చేస్తామని చెబుతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రమేశ్ సిబ్బంది మాట్లాడుతున్నారు. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను కూల్చేసేందుకు ఇప్పటికే అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.

*బీజేపీ నేతలు మరియు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తలపెట్టిన చలో గుడివాడను అడ్డుకున్న పోలీసులుసీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు కార్యకర్తలు అరెస్ట్ సోము వీర్రాజు పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాటసీఎం రమేష్ మమ్ములను ఎందుకు అడ్డుకుంటున్నారు, గుడివాడలో 144 సెక్షన్ ఉందా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన రమేష్ సీఎం డౌన్ డౌన్ నినాదాలతో దద్దరిల్లిన గుడివాడ పరిసరాలు
ఉద్రిక్తంగా మారిన చలో గుడివాడ, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన సోము వీర్రాజు వీర్రాజు సహా పలువురు నేతలు అరెస్ట్, కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని డిమాండ్. కలువపాముల వద్ద బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.

*కేంద్రమంత్రి వర్యులు శ్రీ మురళీధరన్ గారిని విమర్శిస్తూ రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కేంద్ర మంత్రుల జైలుకేళ్ళడం నేరమా ? మరి సిబిఐ అరెస్ట్ చేసిన వ్యక్తులను పులివెందలలో ప్రజా ప్రథినిధులు వెల్లి దౌర్జన్యం చేయడం ప్రజాస్వామ్య మా ? జైల్లు గురించి వైకాపా మంత్రులు మాట్లాడం సిగ్గుచేటు . కేంద్ర మంత్రి తప్ప చేసినట్లు మీరు అంటున్నారు కదా మీ చేతనైతే కేంద్ర మంత్ గారి మీద కేసు పెట్ట చర్యలు తీసుకోండి . పోలీస్ స్టేషన్ మీద ఘోరంగా రాళ్లదాడి చేసి, బోర్డును తగలబెట్టి, పోలీసులను గాయపరచి, పోలీస్ స్టేషన్ పరిధిలోనే వాహనాన్ని తగలబెట్టి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించిన వారిని అడ్డుకోలేని, వారి మీద కఠినమైన చర్యలు తీసుకోలేని, రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేసి ఒక దుర్మాగపు పాలన సాగిస్తున్న మీకు మా మంత్రి గారిని విమర్శించే హక్కు ఉందా అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.

*డిఎస్పీ పిలుపు మేరకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వ్యక్తిని పట్టుకుని, ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తిని పట్టుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడంటూ అపనిందలు మోపుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ ఉంటే బిజెపి చూస్తూ కూర్చోవాలా?సాక్ష్యాత్తూ జిల్లా ఎస్పీ గారే ఆత్మకూరులో మతవిద్వేషాలను రెచ్చగొట్టి, ఇలాంటి దాడులకు ఉసిగొల్పే ఎస్డీపిఐ కార్యకలాపాలు సాగిస్తున్నదని చెప్పిన తర్వాత కూడా మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే తీవ్రవాదులకు, దుర్మార్గులకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొమ్ము కాస్తుందన్న విషయం స్పష్టమవుతోంది.ప్రభుత్వ సొమ్ముతో రాష్ట్రంలో చర్చిలు కట్టించి, వక్ఫ్ భూములకు ప్రహరీ గోడలు కట్టించి, పాస్టర్లకు, ఇమామ్ లు, మౌజంలకు నిరాటంకంగా జీతాలు చెల్లించే మీ నుండి హిందూ ఆలయాలకు, హిందూ ధర్మానికి రక్షణ ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది.బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతూ, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులను బనాయించి హింసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు సాగిస్తున్న అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడే రోజు అతి త్వరలోనే వస్తుంది.

*కడప నగరంలో సంచలనం సృష్టించిన బంగారు దుకాణం దొంగతనం కేసును చేధించిన పోలీసులు..రూ. 26 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం..మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్…కడప బి కె ఎం వీధిలో జరిగిన బంగారు దుకాణంలో జరిగిన దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు…ఈ నెల 13 వ తేదీన NJ జ్యూవెలర్స్ దుకాణంలో గ్రిల్ కిటికిని కట్ చేసి 466 గ్రాముల బంగారు ఆభరణాలు, 5.5 కేజీల వెండిని అపహరించిన దుండగుడు..ఘటన జరిగిన వెంటనే సిసి కెమెరాల ఆధారంగా ప్రత్యేక బృందం ద్వారా విచారణ చేపట్టిన పోలీసులు…అరెస్టయిన నిందితుడు పెనగలూరు కి చెందిన చప్పిడి మణి అలియాస్ ఇమ్రాన్ (29) గా గుర్తింపు…పట్టుబడ్డ నిందితుని వద్ద నుండి పోయిన సొమ్ము మొత్తం 466.గ్రాముల బంగారు ఆభరణాలు, 5.5 కేజీల వెండి ఆభరణాలు , దోంగతనానికి ఉపయోగించిన సామగ్రి, స్కూటీ ద్విచక్రవాహనం స్వాధీనం…పట్టుబడ్డ బంగా వెండి ఆభరణాల విలువ 25.50 లక్షల రూపాయలు ఉంటుందన్న జిల్లా ఎస్పీ.

*కేసును ఛేదించి చోరీ సొత్తు రికవరీ కి కడప డి.ఎస్.పి బి.వెంకటశివారెడ్డి ఆధ్వర్యంలో కృషి చేసిన చిన్నచౌక్ సి.ఐ అశోక్ రెడ్డి, అర్బన్ సిఐ మహమ్మద్ అలీ తో పాటు, ఎస్సై రాఘవేంద్ర రెడ్డి, తులసినాగప్రసాద్, పెండ్లిమర్రి ఎస్.ఐ రాజరాజేశ్వర రెడ్డి, ఖాజీపేట ఏ.ఎస్.ఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కానిస్టేబుళ్లు రాజేష్, బాషా, నారాయణరెడ్డి, సుబ్బారాయుడు, హుస్సేన్, నాగరాజు, సాయి లను ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందచేసిన జిల్లా ఎస్పీ అన్బురాజన్…

*తిరువూరు మండలం మల్లెల గ్రామ శివారు మామిడితోటలో ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు..చనిపోయిన వ్యక్తిది చెల్లి వీరయ్య విస్సన్నపేట మండలం పుట్రేల వాసిగా గుర్తింపు..పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది..

* విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామం శివాలయం వీదిలో గాడి హారిక వయసు 22 (మహిళ) ఉరి వేసుకుని మృతి చెందింది. అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పడమట పోలీసులు ..

*రామచంద్రపురం మండలం జగన్నాయకులపాలెం గ్రామంలో మోర్త నాగేంద్ర బాబు అనే యువకుడు పై దాడి బీరు బాటిల్ తో గొంతు ను కోసేసి పరారైన దుండగులురామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడుపాతకక్షలు నేపధ్యంలో రాత్రి జరిగిన వీరభద్రుని సంబరంలో చోటుచేసుకున్న ఘటన ద్రాక్షరామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పక్కా సమాచారం మేరకు దాడి చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.ఈ దాడిలో ఓ ఇంటిలో నిల్వ ఉన్న 80 బస్తాల్లో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన, అమ్మిన కేసులు నమోదు చేస్తామని రూరల్ ఎస్ఐ సుమన్ హెచ్చరించారు.