DailyDose

కొత్త జిల్లాలు వచేస్తున్నాయి..

కొత్త జిల్లాలు వచేస్తున్నాయి..

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తులు ముమ్మరమయ్యాయి.ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కూడా జరిగింది.అమలులోకి రావడం ఇక లాంఛనమేనని అర్ధం చేసుకోవాలి.ఈ ఉగాది లోపే సర్వం సిద్ధమని వినికిడి.వై ఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ,తదనుగుణంగా రూపకల్పన చేసిన  మేనిఫెస్టోకు తగ్గట్టుగా,ప్రభుత్వం కొత్త జిల్లాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.గత సంవత్సరంలోనే అమలులోకి రావాల్సివుంది. జనగణన -2021 వల్ల ఇంత సమయం పట్టింది.కరోనా వల్ల జనగణన ఇంకా మొదలవ్వలేదు.అది మొదలయ్యే లోపే పునర్వ్యవస్థీకరణను పూర్తి చెయ్యాలన్నది ప్రభుత్వ సంకల్పం.పరిపాలనను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లడానికి,అభివృద్ధిని వేగిరపరచడానికి,వెనుకబడిన ప్రాంతాల వికాసానికి, ప్రాంతీయ సమతుల్యతకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ తప్పక ప్రయోజనకారిగా నిలుస్తుంది.పాలకుల చిత్తశుద్ధి,అధికారుల వివేచన సంపూర్ణంగా ఉంటే,ఆశించిన ఫలాలు అందరికీ  దక్కుతాయి. అందులో సందేహమే లేదు.  పరిపాలనా సౌలభ్యం,ప్రజల సౌకర్యం,మానవ,సహజ వనరుల సద్వినియగం పేరుతో జిల్లాల సంఖ్య  పెంచాలనే ఆలోచనతో ఈ బృహత్ కార్యాచరణ చేపట్టామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెప్పుకుంటూ వచ్చారు.

ఈ దిశగా  కమిటీలు, ఉపసంఘాలు కూడా ఏర్పడ్డాయి.కమిటీలు సమగ్రంగా అధ్యయనం చేసి,   సమర్పించిన నివేదికల ఆధారంగా నేడు ఆచరణ బాటపడుతున్నారు.ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు అవసరాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుర్తించారు.తెలంగాణలో ఈపాటికే కొత్త జిల్లాలు అమలులోకి వచ్చాయి.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు వచ్చింది.నవ్యాంద్ర నిర్మాణానికి ఎంతో అవసరం కూడా.ఆంధ్రప్రదేశ్ లో కొత్త  జిల్లాలు వచ్చి ఇప్పటికి చాలా కాలమయ్యింది.చివరగా ఏర్పడ్డ జిల్లాలు ఉత్తరాంధ్రలోని విజయనగరం,కోస్తా ప్రాంతంలోని ప్రకాశం.ఇవి ఏర్పడి కూడా దశాబ్దాలు దాటిపోయింది.అయినప్పటికీ, ఇంకా వెనుకబడిన జిల్లాలుగానే మిగిలిపోయాయాని నివేదికలు చెబుతూనే ఉన్నాయి.

కొన్ని రంగాల్లో అభివృద్ధి నోచుకున్నప్పటికీ,మిగిలిన రంగాలకు విస్తరణ జరగాల్సిన చారిత్రక అవసరం కూడా ఉంది.జూన్ 1వ తేదీ,1979లో విజయనగరం జిల్లా ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతంలో చిట్టచివరగా ఏర్పడిన జిల్లా ఇదే.ఆ తర్వాత, కొత్తగా ఏ జిల్లా ఏర్పడలేదు. ప్రస్తుతం,ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు ఉన్నాయి.లోక్ సభ స్థానాల ప్రాతిపదికతో 25 జిల్లాలు ఏర్పాటు చెయ్యాలనేది  పాలకుల ప్రధానమైన ఆలోచన.గిరిజన ప్రాంతాల  భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా,26వ జిల్లా ఏర్పాటు కూడా అనివార్యమైంది.అరకు గిరిజన ప్రాంతమన్న విషయం తెలిసిందే.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల నిర్మాణ ప్రక్రియపై మిశ్రమమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి,విమర్శలు వచ్చాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  కొత్త జిల్లాల ఏర్పాటులో,నిర్వహణలో తెలంగాణ అనుభవాల నుంచి  మంచి చెడులను గ్రహించవచ్చు.కేవలం జిల్లాలు పెరిగినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమీ పెరుగవని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు.ఈ విషయంలో,అభివృద్ధి ద్వారా సమతుల్యతను సాధించాల్సి ఉంటుంది.జిల్లాల సంఖ్య పెరగడం వల్ల పరిపాలనా వికేంద్రీకరణ పెరుగుతుంది,అదే సమయంలో,నిర్వహణా ఖర్చు కూడా పెరుగుతుందని కొందరు  మాజీ ఐ ఏ ఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాల సంఖ్యతో పాటు అభివృద్ధి,ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడే జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయని వారు భావిస్తున్నారు.అనుభవంతో పండిపోయిన పూర్వ అధికారుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం గణనలోకి తీసుకుంటుందని ఆశిద్దాం.

*పరిపాలనా వికేంద్రీకరణలో స్థానిక నాయకుల ప్రాముఖ్యత కూడా  పెరగాలి.ప్రాముఖ్యత అంటే పెత్తనం కాదు.ప్రజల ప్రయోజనాలే దాని అంతిమ లక్ష్యం.ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాలకు అభివృద్ధిలో, పాలనాపరమైన సౌలభ్యంలో సమన్యాయం జరగడమే అంతిమస్ఫూర్తి అవ్వాలి.ఉత్తరాంధ్రలో అనకాపల్లి,పాడేరు, పార్వతీపురం జిల్లాలు, గోదావరి ప్రాంతంలో రాజమండ్రి అమలాపురం, నరసాపురం(భీమవరం), కృష్ణాప్రాంతంలో విజయవాడ , గుంటూరు,బాపట్ల, నరసరావుపేట, రాయలసీమలో నంద్యాల, హిందూపూర్ (పుట్టపర్తి), రాజంపేట(రాయచోటి), తిరుపతి కొత్త జిల్లా కేంద్రాలుగా   రూపుదిద్దుకోబోతున్నాయన్న విషయం తెలిసిందే.రాయలసీమలో హిందూపూర్ ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలోకి వస్తోంది.బెంగళూరుకు దగ్గరగా ఉండడం కలిసొచ్చే అంశం.కియామోటార్స్ వంటి సంస్థల రాకతో పారిశ్రామిక ప్రగతి ఊపందుకుంటోంది.పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ ఆధునీకరణం ప్రారంభం కావడం శుభసూచకం.ఈ ప్రాంతంలో భూములకు గిరాకీ బాగా పెరిగిపోతోంది.నరసరావుపేటను జిల్లాకేంద్రంగా మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాజకీయంగా,విద్యాపరంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం.ప్రకాశం జిల్లావాసులకు బాగా అనుబంధం ఉన్న పట్టణం కూడా.గిరిజన ప్రాంతంలో రెండు జిల్లాలు ఏర్పాటు చేయడం కూడా ఎంతో ప్రయోగాత్మకమైన నిర్ణయం.వాణిజ్య కేంద్రాలైన విజయవాడ,రాజమహేంద్రవరం, వ్యవసాయ కేంద్రమైన అనకాపల్లి వంటివి జిల్లాలుగా మారడం మంచి అడుగు. అమలాపురం,నరసాపురం, నంద్యాల,బాపట్ల వంటి పాత పట్టణాలకు నేడు జిల్లా హోదా లభించడం ఆమోదయోగ్యం.ఇలా కొత్త జిల్లాల రూపకల్పనలో తీసుకున్న ప్రాతిపదికలను ఎక్కువమంది స్వాగతిస్తున్నారు.కొత్తరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు కొత్త జిల్లాల ఏర్పాటు కొత్తనెత్తురు అందిస్తుందని నమ్ముదాం.అసమానతలు పూర్తిగా తొలగిననాడే నిజమైన పర్వదినం. 

*ఆంద్రప్రదేశ్ నూతన జిల్లాల స్వరూపం
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నూతన జిల్లాల జనాభా, వైశాల్యం, నియోజకవర్గాలు,రెవెన్యూ డివిజన్లు మీకోసం..!

1.జిల్లా: శ్రీకాకుళం
ముఖ్య పట్టణం: శ్రీకాకుళం
నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16) మొత్తం మండలాలు 30.వైశాల్యం: 4,591 చ.కి.మీ

2.జిల్లా : విజయనగరం
జిల్లా కేంద్రం: విజయనగరంనియోజకవర్గాలు: 7 (రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట)
రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి(11), విజయనగరం(15) మండలాలు 26వైశాల్యం: 3,846 చ.కి.మీజనాభా: 18.84 లక్షలు

3.జిల్లా పేరు : మన్యం
జిల్లా కేంద్రం పార్వతీపురం
నియోజకవర్గాలు: 4(పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు)
రెవెన్యూ డివిజన్లు: పాలకొండ(6),పార్వతీపురం(10)
మొత్తం మండలాలు 16వైశాల్యం: 3,935 చ.కి.మీజనాభా: 9.72లక్షలు

4.జిల్లా పేరు : అల్లూరి సీతారామరాజు
జిల్లా కేంద్రం: పాడేరునియోజకవర్గాలు: 3 (పాడేరు, అరకు,రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా పాడేరు(11), రంపచోడవరం(11) మొత్తం మండలాలు 22
వైశాల్యం : 12,251 చ.కి.మీజనాభా : 9.54 లక్షలు

5.జిల్లా పేరు : విశాఖపట్నం
జిల్లా కేంద్రం: విశాఖపట్నం
నియోజకవర్గాలు: 6 (భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక)రెవెన్యూ డివిజన్లు: కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(5)
మొత్తం మండలాలు 10వైశాల్యం : 928 చ.కి.మీజనాభా : 18.13 లక్షలు 

6.జిల్లా పేరు : అనకాపల్లి
జిల్లా కేంద్రం: అనకాపల్లి
నియోజకవర్గాలు: 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి)
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం(10),అనకాపల్లి(15) మొత్తం మండలాలు 25వైశాల్యం : 4,412 చ.కి.మీ,జనాభా : 18.73 లక్షలు

7.జిల్లా పేరు : తూర్పుగోదావరి
జిల్లా కేంద్రం: కాకినాడ
నియోజకవర్గాలు: 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం)
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం(12),కాకినాడ(7) మొత్తం మండలాలు 19వైశాల్యం : 2,605 చ.కి.మీజనాభా : 19.37 లక్షలు

8.జిల్లా పేరు : కోనసీమ
జిల్లా కేంద్రం: అమలాపురం
నియోజకవర్గాలు: 7 (రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం)
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం(8), అమలాపురం(16) మొత్తం మండలాలు 24
వైశాల్యం: 2,615 చ.కి.మీజనాభా: 18.73 లక్షలు

9.జిల్లా పేరు : రాజమహేంద్రవరం
జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
నియోజకవర్గాలు: 7 (అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(10)
మొత్తం మండలాలు 20
వైశాల్యం: 2,709 చ.కి.మీజనాభా: 19.03 లక్షలు

10.జిల్లా పేరు : నరసాపురం
జిల్లా కేంద్రం: భీమవరం
నియోజకవర్గాలు: 7 (ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం(8), కొత్తగా భీమవరం(11)
మొత్తం మండలాలు 19వైశాల్యం: 2,178 చ.కి.మీ
జనాభా: 17.80 లక్షలు

11.జిల్లా పేరు : పశ్చిమగోదావరి
జిల్లా కేంద్రం: ఏలూరు
నియోజకవర్గాలు: 7 (ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు)
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు(12),జంగారెడ్డిగూడెం(9), నూజివీడు(6) మొత్తం మండలాలు 27
వైశాల్యం: 6,413 చ.కి.మీజనాభా: 20.03 లక్షలు 

12.జిల్లా పేరు : కృష్ణా
జిల్లా కేంద్రం: మచిలీపట్నం
నియోజకవర్గాలు: 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ)
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12)
మొత్తం మండలాలు 25
వైశాల్యం: 3,775 చ.కి.మీజనాభా: 17.35 లక్షలు

13.జిల్లా పేరు : ఎన్టీఆర్
జిల్లా కేంద్రం: విజయవాడ
నియోజకవర్గాలు: 7 (విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు)
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7)
మొత్తం మండలాలు 20
వైశాల్యం: 3,316 చ.కి.మీజనాభా: 22.19 లక్షలు

14.జిల్లా పేరు : గుంటూరు
జిల్లా కేంద్రం: గుంటూరు
నియోజకవర్గాలు: 7 (తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి)
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8) మొత్తం 18 మండలాలు
వైశాల్యం: 2,443 చ.కి.మీజనాభా: 20.91 లక్షలు

15.జిల్లా పేరు : బాపట్ల
జిల్లా కేంద్రం: బాపట్ల
నియోజకవర్గాలు : 6 వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల
రెవెన్యూ డివిజన్లు : కొత్తగా బాపట్ల(12), కొత్తగా చీరాల (13)
మొత్తం మండలాలు 25
వైశాల్యం : 3,829 చ.కి.మీజనాభా : 15.87 లక్షలు

16.జిల్లా పేరు : పల్నాడు
జిల్లా కేంద్రం: నరసరావుపేట
నియోజకవర్గాలు : 7 పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి
వెన్యూ డివిజన్లు : గురజాల (14), నరసరావుపేట(14)
మొత్తం మండలాలు 28
వైశాల్యం : 7,298 చ.కి.మీ
జనాభా : 20.42 లక్షలు

17.జిల్లా పేరు : ప్రకాశం
జిల్లా కేంద్రం: ఒంగోలు
నియోజకవర్గాలు : 8 యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి
రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13) మొత్తం మండలాలు 38
వైశాల్యం : 14,322 చ.కి.మీజనాభా : 22.88 లక్షలు 

18.జిల్లా పేరు : పొట్టి శ్రీరాములు నెల్లూరు
జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు : 8 కోవూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు
రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు (12), ఆత్మకూరు (11), కావలి(12)
మొత్తం మండలాలు 35
వైశాల్యం : 9,141 చ.కి.మీ
జనాభా : 23.37 లక్షలు

19.జిల్లా పేరు : కర్నూలు
జిల్లా కేంద్రం: కర్నూలు
నియోజకవర్గాలు : 8 పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17)
మొత్తం మండలాలు 28
వైశాల్యం : 8,507 చ.కి.మీజనాభా : 23.66 లక్షలు

20.జిల్లా పేరు : నంద్యాల
జిల్లా కేంద్రం: నంద్యాల
నియోజకవర్గాలు : 6 నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు
రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్‌ (8), కొత్తగా ఆత్మకూరు(10) మొత్తం మండలాలు 27
వైశాల్యం : 9,155 చ.కి.మీ
జనాభా : 16.87 లక్షలు 

21.జిల్లా పేరు : అనంతపురం
జిల్లా కేంద్రం: అనంతపురం
నియోజకవర్గాలు : 8 రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్‌
రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం (12), అనంతపురం (14), కొత్తగా గుంతకల్‌(8)
మొత్తం మండలాలు 34
వైశాల్యం : 11,359 చ.కి.మీ
జనాభా : 23.59 లక్షలు

22.జిల్లా పేరు : శ్రీసత్యసాయిజిల్ల
 కేంద్రం : పుట్టపర్త
నియోజకవర్గాలు : 6 మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి
రెవెన్యూ డివిజన్లు : పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8)
మొత్తం మండలాలు 29
వైశాల్యం : 7,771 చ.కి.మీ
జనాభా : 17.22 లక్షలు

23.జిల్లా పేరు : వైఎస్సార్ కడప
జిల్లా కేంద్రం: కడప
నియోజకవర్గాలు : 7 కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు
రెవెన్యూ డివిజన్లు : కడప(10), జమ్మలమడుగు(12), కొత్తగా బద్వేలు (12)
మొత్తం మండలాలు 34
వైశాల్యం : 10,723 చ.కి.మీ
జనాభా : 19.90 లక్షలు

24.జిల్లా పేరు : అన్నమయ్య
జిల్లా కేంద్రం: రాయచోటి
నియోజకవర్గాలు : 6 రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి
రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11)
మొత్తం మండలాలు 32
వైశాల్యం : 8,459 చ.కి.మీ
జనాభా : 17.68 లక్షలు

25.జిల్లా పేరు : చిత్తూరు
జిల్లా కేంద్రం: చిత్తూరు
నియోజకవర్గాలు : 7 నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు
రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా పలమనేరు, (15)
మొత్తం మండలాలు 33
వైశాల్యం : 7,210 చ.కి.మీ
జనాభా : 19.85 లక్షలు

26.జిల్లా పేరు : శ్రీ బాలాజీ
జిల్లా కేంద్రం: తిరుపతి
నియోజకవర్గాలు : 7 సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి
రెవెన్యూ డివిజన్లు : నాయుడుపేట(13), గూడూరు (11), తిరుపతి (11)
మొత్తం మండలాలు 35
వైశాల్యం : 9,176 చ.కి.మీ
జనాభా : 22.18 లక్షలు 26 నూతన జిల్లాల ఏర్పాటు బాలాజీ, అన్నమయ్య, అల్లూరి, ఎన్టీఆర్‌, సత్యసాయి పేర్లతో కొత్త జిల్లాలుఆన్‌లైన్‌లో ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గంనేడు వెలువడనున్న నోటిఫికేషన్‌ఉగాది నాటికి ప్రక్రియ పూర్తికి లక్ష్యంరా ష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.